Advertisement

కత్రిన `ఐకానిక్` లుక్!

Jan 17 2021 @ 13:16PM

దాదాపు దశాబ్ద కాలం నుంచి బాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా వెలుగొందుతోంది కత్రినా కైఫ్. మంచి నటిగా, అద్భుతమైన డ్యాన్సర్‌గా గుర్తింపు సంపాదించుకుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఆమె గ్లామర్ మరింత పెరుగుతోంది. తాజాగా కత్రిన ఓ మ్యాగజైన్ కోసం ఫొటో షూట్‌లో పాల్గొంది. 


సముద్రపు ఒడ్డున రెడ్ హాట్ డ్రెస్ ధరించి కత్రిన ఫొటో షూట్‌లో పాల్గొంది. ప్రముఖ `పీకాక్` మేగజైన్ కవర్ పేజీపై `ఐకానిక్` లుక్‌లో వెలిగిపోయింది. ఈ ఫొటోను కత్రిన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. `రెడ్ హాట్ బ్యూటీ` అంటూ కత్రినపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

 


Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.