వంటలు

ఖట్టా మీఠా చట్నీ

ఖట్టా మీఠా చట్నీ

కావలసిన పదార్థాలు: ఖర్జూరాలు- కప్పు, చింతపండు- పావు కప్పు, బెల్లం తురుము- అర కప్పు, కారం పొడి- సగం స్పూను, జీలకర్ర- స్పూను, ఉప్పు- తగినంత.


తయారుచేసే విధానం: ఓ పాన్‌లో విత్తనాలు తీసిన ఖర్జూరం ముక్కలు, చింతపండు, మిగతా పదార్థాలన్నీ వేసి ఒకటిన్నర కప్పు నీళ్లు జతచేసి ఓ పావు గంట ఉడికించాలి. చల్లారాక మిక్సీలో మెత్తగా రుబ్బి వడగడితే ఖట్టా మీఠా చట్నీ రెడీ. దీన్ని ఫ్రిజ్‌లో పెడితే పది రోజులు నిలువ ఉంటుంది.

Follow Us on:
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.