కట్టా సేవలు చిరస్మరణీయం : వీసీ

ABN , First Publish Date - 2022-08-15T05:13:45+05:30 IST

సీపీబ్రౌన్‌ స్మారక గ్రంథాలయ ట్రస్ట్‌ సభ్యులుగా, సంయు క్త కార్యదర్శిగా, బాధ్యులుగా, సలహామండలి సభ్యులుగా విద్వాన్‌ కట్టా నరసింహులు సేవలు చిరస్మరణీయమని యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మునగల సూర్యకళావతి కొనియాడారు.

కట్టా సేవలు చిరస్మరణీయం : వీసీ
కట్టా స్మారక పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న దృశ్యం

కడప (కల్చరల్‌), ఆగస్టు 14: సీపీబ్రౌన్‌ స్మారక గ్రంథాలయ ట్రస్ట్‌ సభ్యులుగా, సంయు క్త కార్యదర్శిగా, బాధ్యులుగా, సలహామండలి సభ్యులుగా విద్వాన్‌ కట్టా నరసింహులు సేవలు చిరస్మరణీయమని యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మునగల సూర్యకళావతి కొనియాడారు. సీపీబ్రౌన్‌ భాషాపరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో స్మారక (కట్టా నరసింహులు జీవిత, చారిత్రక, సారస్వత సౌరభాలు) పుస్తకావిష్కరణ గావించారు.

కట్టా నరసింహులుకు గ్రంథాలయం అమితమైన భక్తివిశ్వాసాలు ఉండేవన్నారు. బాధ్యులుగా ఉద్యోగ విరమణ అనంతరం కూడా కైఫియత్తుల ముద్రణలో ఇతర పరిశోధనాంశాల్లో సలహాలు, సూచనలు, ఇచ్చేవారన్నారు. బ్రౌన్‌ గ్రంథాలయ రజతోత్సవాలు ఘనంగా నిర్వహించడం వెనుక కట్టా తోడ్పాటు చాలా వుందని గుర్తుచేశారు. కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి  ఆచార్య మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి,  ప్రముఖ అవధాని నరాల రామారెడ్డి, స్టెప్‌ సీఈఓ బ్రహ్యయ్య, కట్టా ఆత్మీయ మిత్రులు పుత్తా పుల్లారెడ్డి, భాషాపరిశోధన కేంద్రం బాధ్యులు మూల మల్లికర్జునరెడ్డి, చింతకుంట శివారెడ్డి, కట్టా సతీమణి వరలక్ష్మి, కుటుంబీకులు జయవర్థన్‌ మాధవి, శ్రీలక్ష్మి, సుచిత్ర, తన్మయి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-15T05:13:45+05:30 IST