రికార్డు సృష్టించిన Kattupalli ఓడరేవు

Published: Fri, 20 May 2022 10:21:11 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రికార్డు సృష్టించిన Kattupalli ఓడరేవు

ప్యారీస్‌(చెన్నై): దేశ నౌకా వాణిజ్య చరిత్రలో తిరువళ్లూర్‌ జిల్లాలోని కాట్టుపల్లి ఓడరేవు సరికొత్త రికార్డు నెలకొల్పింది. మోనో టెక్నాలజీతో డిజైన్‌ చేసిన 450 వాట్స్‌ సామర్థ్యం కలిగిన పవర్‌ గ్రిడ్‌ సోలార్‌ జనరేషన్‌ ప్లాంట్‌ను నిర్మించింది. ఈ సోలార్‌ ప్లాంట్‌ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా చెక్కుచెదరకుండా పనిచేసేలా డిజైన్‌ చేశారు. పోర్టు చుట్టుపక్కల 30 కి.మీ వరకు వాయుకాలుష్యాన్ని వ్యాపింపజేయకుండా ఈ ప్లాంట్‌ పనిచేస్తుందని, కాట్టుపల్లి ఓడరేవు, అదానీ పోర్ట్స్‌ అండ్‌ లాజిస్టిక్‌ సంస్థలు సంయుక్తంగా దేశంలోని ఓడరేవుల్లో మొట్టమొదటిసారిగా ఈ పథకాన్ని చేపట్టి రికార్డు నెలకొల్పినట్లు పోర్టు అధికారులు తెలిపారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.