మహిళా ఖైదీలకు కౌశల్ వికాస్ యోజన పథకం కింద వృత్తి శిక్షణ

ABN , First Publish Date - 2022-03-15T14:37:47+05:30 IST

దేశంలో మొట్టమొదటిసారి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా జైలులో ఉన్న మహిళా ఖైదీలకు కౌశల్ వికాస్ యోజన పథకం కింద వృత్తి శిక్షణ ఇస్తున్నారు....

మహిళా ఖైదీలకు కౌశల్ వికాస్ యోజన పథకం కింద వృత్తి శిక్షణ

ఆగ్రా (ఉత్తరప్రదేశ్): దేశంలోనే మొట్టమొదటిసారి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా జైలులో ఉన్న మహిళా ఖైదీలకు కౌశల్ వికాస్ యోజన పథకం కింద వృత్తి శిక్షణ ఇస్తున్నారు. ఆగ్రా జిల్లా జైలులో 144 మంది మహిళా ఖైదీలకు కౌశల్ వికాస్ యోజన పథకం నిధులతో బ్యూటీషియన్, కుట్టు శిక్షణ అందిస్తున్నారు. ఈ పథకం కింద టైలరింగ్, బ్యూటీ పార్లర్‌లలో శిక్షణ పొంది స్వయం ఉపాధి కల్పించుకునేందుకు ప్రయత్నించామని ఓ మహిళా ఖైదీ  చెప్పారు. తెలిపారు. జైలు సూపరింటెండెంట్ పీడీ సలోనియా మహిళా ఖైదీలకు వృత్తి శిక్షణ ఇవ్వడంలో కీలక పాత్ర పోషించారు.మొదటి బ్యాచ్ శిక్షణలో 35 మంది మహిళా ఖైదీలు శిక్షణ పొంది సర్టిఫికెట్లు పొందారని సలోనియా తెలిపారు. మహిళా ఖైదీలు జైలు నుంచి విడుదలైన తర్వాత బ్యూటీ పార్లర్లలో పని చేయడం లేదా కుట్టుపని చేయడం ద్వారా వారు తమ కుటుంబాన్ని చూసుకోగలుగుతారని జైలు సూపరింటెండెంట్ చెప్పారు.జైలు శిక్ష అనుభవించే భవనంలా మారకూడదని, జైలు నుంచి విడుదలైన తర్వాత ప్రతి ఖైదీ తనకు తానుగా స్వయం ఉపాధి కల్పించుకొని నిజాయితీ గల పౌరులుగా జీవితాన్ని గడపాలని సలోనియా కోరారు.


Updated Date - 2022-03-15T14:37:47+05:30 IST