విజృంభిస్తున్న దోమలు!

ABN , First Publish Date - 2021-12-15T04:18:21+05:30 IST

కావలి మున్సిపాల్టీ పరిధిలో ప్రజలపై రేయి పగలు తేడా లేకుండా దోమల దాడి చేస్తోన్నాయి.

విజృంభిస్తున్న దోమలు!
కావలి : క్రిష్టియన్‌పేటలో రోడ్డుపై ఉన్న చెత్తాచెదారం

మొక్కుబడిగా నివారణ చర్యలు

ప్రబలుతున్న డెంగ్యూ ..!

ఉత్పత్తి కేంద్రాలుగా డ్రైనేజీ కాలువలు

కావలి, డిసెంబరు 14: కావలి మున్సిపాల్టీ పరిధిలో ప్రజలపై రేయి పగలు తేడా లేకుండా దోమల దాడి చేస్తోన్నాయి. మున్సిపాల్టీ లో 40 వార్డులు, 17 మురికి వాడలు ఉన్నాయి. 1.10 లక్షల జనాభా ఉండగా పారిశుధ్య కాంట్రాక్ట్‌ కార్మికులు 256 మంది, పర్మినెంట్‌ కార్మికులు 35 మంది ఉన్నారు. 5 ఫ్యాగింగ్‌ మిషన్లు ఉన్నాయి. అయినా నివారణ చర్యలు చేపట్టాల్సిన మున్సిపాల్టీ అధికారులు నామమాత్రపు చర్యలతో చేతులు దులుపుకుం టున్నారు. నెల రోజులుగా కురుస్తున్న వ ర్షాలకు నీటి నిల్వలు పెరగడంతో పాటు ఎక్కడి కక్కడ పారిశుధ్యం పడకేయ డం, పట్టణంలో వరవ కాలువ, పంట కాలువలతో పాటు అనేక డ్రైనేజీల్లో మురుగు చేరడంతో అవి దోమల ఉత్పత్తి కేంద్రాలు గా మారాయి. దోమల వలన రోగాలు వచ్చే ప్రమాదం ఉన్నా ఆ మేరకు పారిశుధ్యం మెరు గుకు ప్రత్యేక చర్యలు చేపట్టలేదు. దోమల లార్వా నిర్మూలనకు డ్రైనేజీల్లో ఎక్కడా ఆయిల్‌ బాల్స్‌ వదిలిన పాపాన పోలేదు. ఫ్యాగింగ్‌ యంత్రాలు ఉన్నా వాటిని వినియోగించడం లేదు. అక్కడ క్కడ పూడికలు తీసినా సకాలంలో మట్టిని తొలగించకపోవటంతో ఆ ప్రాంతాలన్నీ అపరిశుభ్రంగా తయారవుతున్నాయి. ఇంటింటికి చెత్త సేకరణ జరుగుతున్నా రోడ్లపై పడిన చెత్తను మాత్రం తొలగించక దుర్వాసన వెదజల్లుతుంటాయి.

దోమల నివారణ చర్యలు శూన్యం

అల్లూరు : అల్లూరు నగర పంచాయతీలో మొత్తం 20 వార్డులు, 35670 మంది జనాభా కలిగి ఉంది. పంచాయతీలుగా ఉన్నప్పుడు అల్లూరు, నార్తుమోపూరు, సింగపేట గ్రామాల్లో పారిశుధ్యంపై ప్ర త్యేక శ్రద్ధ ఉండేది. కానీ ప్రస్తుతం పారిశుధ్యం అధ్వానంగా ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు నీరు చేరి మురుగు ఏర్పడి దోమలకు అడ్డాగా మారాయి. పారిశుధ్య పనులు చేపట్టడంలో నగర పంచాయతీ విఫలమైంది. దీంతో దోమలు ఉధృతమై డెంగ్యూ, మలేరియా జ్వరాలకు కారకాలుగా మారాయి. పది రోజులుగా నగర పంచాయతీలో విషజ్వరాలు వెంటాడుతున్నాయి. కనీసం బ్లీచింగ్‌ చల్లించడం, దోమల నివారణకు మందు పిచికారి, ఆయిల్‌ బాల్స్‌ వేయడం తదితర కార్యక్రమాలు కూడా చేపట్టకపోవడం గమనార్హం. పంచాయతీ పరిధిలోని 20 వార్డులకు 70 మంది మాత్రమే పారిశుధ్య సిబ్బంది ఉన్నారు. దీంతో అన్ని వార్డుల్లో పూర్తిస్థా యిలో పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొంది.

Updated Date - 2021-12-15T04:18:21+05:30 IST