తీరప్రాంతంలో భూకబ్జాలను అరికట్టాలి

Jul 26 2021 @ 21:57PM
ఆర్డీవో శీనా నాయక్‌కు వినతిపత్రం

స్పందనలో ఆర్డీవోకి మొర

కావలి, జూలై 26: కావలి రూరల్‌ మండలం తీరప్రాంతంలో కోస్టల్‌ కారిడార్‌ పేరుతో పేదల భూములను కొందరు ఆక్రమించి కబ్జాలకు పాల్పడుతున్నారని వాటిని అరికట్టాలని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్‌.మల్లి పేర్కొన్నారు. సోమవారం ఆయన కావలి ఆర్డీవో కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో ఆర్డీవో శీనా నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. మండలంలోని పూలదొరువులో అరగల పెద వెంకమ్మకు చెందిన సర్వేనెంబరు 844/2లో 1.37 ఎకరాల భూమి ఆక్రమణకు గురైందన్నారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమేనని చెప్పారు. దీనిపై విచారించి పేదలకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ప్రజావిజ్ఞప్తుల దినం రోజు కూడా ప్రభుత్వం వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తుండటంతో ఎంతో దూరం నుంచి వచ్చిన ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని మల్లి పేర్కొన్నారు. కావలి ఆర్డీవో కార్యాలయంలో మధ్యాహ్నం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తూ సాయంత్ర 5 గంటల వరకు అర్జీలు తీసుకోకపోవటంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఇబ్బందులకు గురయ్యారన్నారు. ప్రజావిజ్ఞప్తుల దినం రోజు వీడియో కాన్ఫరెన్స్‌ల కన్నా అర్జీదారులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి

దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నియోజకవర్గ దివ్యాంగుల సంఘం అధ్యక్షడు పోసిన వెంకట్రావ్‌ గౌడ్‌ ఆర్డీవో  కార్యాలయంలో సోమవారం ఆర్డీవో శీనా నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. ముసునూరులో దివ్యాంగులకు కేటాయించిన 831 సర్వే నెంబర్‌లోని 15 ఫ్లాట్లు వీఆర్‌ఏలకు కేటాయించారని, మరో 15 ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయని, ఈ 30 ఫ్లాట్టు దివ్యాంగులకే కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని దివ్యాంగులు పాల్గొన్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.