సంచార పశువైద్య అంబులెన్స్‌ సేవలు వినియోగించుకోండి

ABN , First Publish Date - 2022-05-21T04:23:49+05:30 IST

పాడి పరిశ్రమ అభివృద్ధి, పశు వృద్ధిని దృష్టిలో పెట్టుకుని గ్రామీణ ప్రాంత పశుపోషకుల సౌలభ్యం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సంచార పశువైద్య అంబులెన్స్‌ సేవలను వినియోగంలోకి తెచ్చారని కావలి ఆర్డీవో శీనానాయక్‌ పేర్కొన్నారు.

సంచార పశువైద్య అంబులెన్స్‌ సేవలు వినియోగించుకోండి
సంచార పశువైద్య అంబులెన్స్‌ను ప్రారంభిస్తున్న ఆర్డీవో శీనా నాయక్‌

ఆర్డీవో శీనానాయక్‌

కావలి, మే 20: పాడి పరిశ్రమ అభివృద్ధి, పశు వృద్ధిని దృష్టిలో పెట్టుకుని గ్రామీణ ప్రాంత పశుపోషకుల సౌలభ్యం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సంచార పశువైద్య అంబులెన్స్‌ సేవలను వినియోగంలోకి తెచ్చారని కావలి ఆర్డీవో శీనానాయక్‌ పేర్కొన్నారు. అనవసరంగా ఫోన్‌లు చేసి ఈ సేవలను దుర్వినియోగ పరచుకుండా అవసరమైన వారు వినియోగించుకుని తమ పశువులకు సకాలంలో వైద్య సేవలు పొందాలన్నారు. కావలి రైల్వేరోడ్డులోని సశుసంవర్థకశాఖ సహాయ సంచార కార్యాలయం వద్ద శుక్రవారం సంచార పశువైద్య అంబులెన్స్‌ను ఆర్డీవో శీనానాయక్‌  పశుసంవర్థకశాఖ ఇన్‌చార్జి డీడీ వెంకట్రావుతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. పశు పోషకులు తమ పశువులు, మూగ జీవాలు అనారోగ్యానికి గురైనపుడు 1962 టోల్‌ ఫ్రీ నెంబరుకు ఫోన్‌ చేసినట్లయితే ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ మాధవరెడ్డి, అంబులెన్‌ వైద్యుడు ఆవుల వినీత్‌, అన్నగారి పాలెం పశువైద్యుడు నాయక్‌, కావలి వైద్యశాల, అంబులెన్స్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-05-21T04:23:49+05:30 IST