Travel Trends ఫెస్టివల్ సీజన్ ఎఫెక్ట్.. వాటిని డోంట్ కేర్ అంటున్న భారతీయలు

ABN , First Publish Date - 2022-09-22T00:30:59+05:30 IST

కరోనా మహమ్మారి ప్రభావం తగ్గింది. దీనికి తోడు పండగల సీజన్ ప్రారంభమైంది. దీంతో జాతీయ, అంతర్జాతీయ ప్రయాణాలపై ప్రజలు దృష్టిసారించారు. గాలిలో తేలిపోయి నచ్చిన చోట వాలిపోవడానికి సిద్ధం అవుతున్నారు. గతంతో పోల్చితే విమాన ఛార్జీలు విప

Travel Trends ఫెస్టివల్ సీజన్ ఎఫెక్ట్.. వాటిని డోంట్ కేర్ అంటున్న భారతీయలు

ఎన్నారై డెస్క్: కరోనా మహమ్మారి ప్రభావం తగ్గింది. దీనికి తోడు పండగల సీజన్ ప్రారంభమైంది. దీంతో జాతీయ, అంతర్జాతీయ ప్రయాణాలపై ప్రజలు దృష్టిసారించారు. గాలిలో తేలిపోయి నచ్చిన చోట వాలిపోవడానికి సిద్ధం అవుతున్నారు. గతంతో పోల్చితే విమాన ఛార్జీలు విపరీతంగా పెరిగినా.. డోంట్ కేర్ అంటున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ, ప్రముఖ ట్రావెల సర్జ్ ఇంజన్ కయాక్ (KAYAK) వెల్లడించింది. ఫెస్టివల్ సీజన్‌(సెప్టెంబర్ 1 - నవంబర్ 1 తేదీల మధ్య) కు సంబంధించి.. ఇండియన్ టూరిస్టుల ట్రావెల్ ట్రెండ్స్‌ను రివీల్ చేసింది. 


కయాక్ రిపోర్ట్ ప్రకారం.. కరోనా ముందుతో పోల్చితే ప్రస్తుతం విమాన ప్రయాణ ఛార్జీలు విపరీతంగా(దాదాపు 62శాతం) పెరిగాయి. డొమెస్టిక్ ఫ్లైట్ టికెట్ల ధరలు సుమారు 39శాతం పెరిగితే.. ఇదే సమయంలో అంతర్జాతీయ విమానాల టికెట్ రేట్లు దాదాపు 38శాతం పెరిగాయి. ఈ ఫెస్టివల్ సీజన్‌‌ సందర్భంగా డొమెస్టిక్ ఫ్లైట్ల‌(domestic flight)లో ఎకానమీ క్లాస్ రిటర్న్ టికెట్ ధరలు సగటున రూ.8,585 వరకు ఉన్నాయి. అదే అంతర్జాతీయ విమానాల( international economy flight) టికెట్ రేట్లు రూ.56,332 వరకు ఉన్నాయి 



విమాన ఛార్జీలు ఇంతలా పెరిగినా భారత పర్యాటకులు(Indian travellers) మాత్రం వాటిని అస్సలు పట్టించుకోవడం లేదని కయాక్ తన రిపోర్టులో చెప్పింది. 2019తో పోల్చితే ప్రస్తుతం ఫెస్టివల్ సీజన్ సందర్భంగా పలు గమ్యస్థానాలకు ప్రయాణించేందుకు విమానాల కోసం సెర్చ్ చేసిన వారి సంఖ్య 118శాతం పెరిగిందట. ఇందులో 143శాతం మంది ఇంటర్నేషనల్ విమానాల కోసం వెతికితే.. దాదాపు 91శాతం మంది డొమెస్టిక్ ఫ్లైట్‌ల కోసం సెర్చ్ చేశారట. 


దేశీయ పర్యటనకు సిద్ధమైన ప్రయాణికుల్లో ఎక్కువ మంది గోవాను తన గమ్యస్థానంగా ఎంపిక చేసుకున్నట్టు తెలిపింది. ప్రయాణికుల్లో అత్యధిక మంది గోవాకు వెళ్లేందుకు మొగ్గు చూపగా.. ఆ తర్వాత స్థానాల్లో ఢిల్లీ, ముంబైలు ఉన్నాయి. అదే విదేశీ పర్యటనకు సిద్ధమైన ప్రయాణికుల్లో ఎక్కువ మంది దుబాయ్‌ వైపు మొగ్గు చూపారట. ఆ తర్వాత బ్యాంకాక్, లండన్ వంటి ప్రదేశాలపై ఆసక్తి చూపినట్టు కయాక్ రివీల్ చేసిన ట్రావెల్ ట్రెండ్స్‌లో వెల్లడైంది. 


Updated Date - 2022-09-22T00:30:59+05:30 IST