కురిచేడు పీహెచ్‌సీకి‘కాయకల్ప’ అవార్డు

ABN , First Publish Date - 2021-07-25T07:12:58+05:30 IST

కురిచేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 2019-20 సంవత్సరానికి గాను కాయకల్ప అవార్డు దక్కింది.

కురిచేడు పీహెచ్‌సీకి‘కాయకల్ప’ అవార్డు
అవార్డు అందజేస్తున్న జేసీ చేతన్‌

కురిచేడు. జూలై 24: కురిచేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 2019-20 సంవత్సరానికి గాను కాయకల్ప అవార్డు దక్కింది. జేసీ చేతన్‌ చేతుల మీదగా డీఎంహెచ్‌వో రత్నావళి సమక్షంలో వైద్యాధికారి ప్రవీణ్‌ కుమార్‌ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిని సిబ్బంది ఘనంగా సన్మానించారు డాక్టర్‌ ప్రవీణ్‌ మాట్లాడుతూ... వైద్యశాలకు అవార్డు రావడం వెనుక సిబ్బంది కృషి ఎనలేనిదన్నారు. ఉన్నత లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం కాయకల్ప కార్యక్రమం చేపట్టిందన్నారు. నిబంధనలు పాటించడం, అవగాహన బోర్డుల ఏర్పాటు, ఆసుపత్రిలో ఓపీల నిర్వహణ, నోటీసు బోర్డులు, రోగుల వార్డులు, ఆసుపత్రి లోపల బయటా పరిశుభ్రంగా ఉంచడం, అన్ని జాతీయ కార్యక్రమాలు అమలు చేయడం, ఆసుపత్రుల్లో ప్రసవాల నిర్వహణ తదితర అంశాల ఆధారంగా ఈ అవార్డుకు ఎంపిక చేశారన్నారు. పీహెచ్‌సీలోని ఇద్దరు వైద్యాధికారులు ప్రవీణ్‌, సుధారాణిలను సిబ్బంది వైద్యశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు.  కార్యక్రమంలో హెచ్‌ఈవో సుభాని, పీఎంవో హెరాల్డ్‌, హెచ్‌ఎస్‌ విజయకుమార్‌, రమేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-25T07:12:58+05:30 IST