గవర్నర్ వ్యవస్థపై మండిపడిన కేసీఆర్

ABN , First Publish Date - 2022-04-27T18:52:04+05:30 IST

గవర్నర్ వ్యవస్థపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. నేడు హైదరాబాద్‌లో జరుగుతున్న టీఆర్ఎస్ ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ..

గవర్నర్ వ్యవస్థపై మండిపడిన కేసీఆర్

హైదరాబాద్ : గవర్నర్ వ్యవస్థపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. నేడు హైదరాబాద్‌లో జరుగుతున్న టీఆర్ఎస్ ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ.. గవర్నర్ వ్యవస్థ దుర్మార్గంగా మారిందన్నారు. గవర్నర్ వ్యవస్థ వక్రమార్గంలో నడుస్తోందన్నారు. మహారాష్ట్రలో 12 మంది ఎమ్మెల్సీల కోసం తీర్మానం చేసి పంపితే గవర్నర్ తన వద్దే పెట్టుకున్నారన్నారు. తమిళనాడులో పంచాయితీ, బెంగాల్‌లో సైతం పంచాయితీ నడుస్తోందన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌పై కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. ప్రజల బలంతో గెలిచిన ఎన్టీఆర్ దుర్మార్గపు గవర్నర్ వ్యవస్థను గద్దె దించారన్నారు. అదే ఎన్టీఆర్‌ను ప్రజలు తిరిగి గద్దెను ఎక్కించారన్నారు. దేశంలో కొత్త రాజకీయ శక్తి ఆవిర్భవించాలన్నారు. అందులో టీఆర్ఎస్ కీలక భూమిక పోషిస్తుందన్నారు. దేశంలో జరుగుతున్న పరిణామాలపై చర్చ జరగాలని.. జాతి పితను చంపిన హంతకులను పూజించడం దుర్మార్గమన్నారు. మత పిచ్చితో దేశాన్ని ఎటువైపు తీసుకు వెళుతున్నారని కేసీఆర్ ప్రశ్నించారు.

Updated Date - 2022-04-27T18:52:04+05:30 IST