పాలమూరు ప్రాజెక్టులను మరిచిన కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-05-29T05:51:45+05:30 IST

పాదయాత్రలో నడిగడ్డలో తిరిగిన కేసీఆర్‌ ఆర్డీఎస్‌ గురించి మాయమాటలు చెప్పాడు, మోసం చేశాడు.. పాలమూరులోని నెట్టంపాడు, భీమా, కల్వకుర్తి, తుమ్మిళ్ల, ఎస్‌ ఎల్‌బీసీ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకుండా బొంద పెట్టాడని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు తీవ్రంగా విమర్శించారు.

పాలమూరు ప్రాజెక్టులను మరిచిన కేసీఆర్‌
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రఘునందన్‌రావు

- ఆర్డీఎస్‌పై మాయమాటలు

- దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు


గద్వాల, మే 28: పాదయాత్రలో నడిగడ్డలో తిరిగిన కేసీఆర్‌ ఆర్డీఎస్‌ గురించి మాయమాటలు చెప్పాడు, మోసం చేశాడు.. పాలమూరులోని నెట్టంపాడు, భీమా, కల్వకుర్తి, తుమ్మిళ్ల, ఎస్‌ ఎల్‌బీసీ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకుండా బొంద పెట్టాడని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు తీవ్రంగా విమర్శించారు. శనివారం జిల్లా కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ముందు రూ.397 కోట్లతో తుమ్మిళ్లను చేపట్టి రూ.160 కోట్లు ఖర్చు చేసి ఒక మోటారు ఆన్‌చేసి వెళ్లి పోయాడని, 10వేల ఎకరాలు కూడా నీరు పారలేదని విమర్శిం చారు. మల్లమ్మకుంట, జూలకల్లు, వల్లూరు రిజర్వాయర్లు కడు తానని చెప్పిన ఆయన ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించారు. నడి గడ్డలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారని, ఎందుకు ప్రశ్నిం చరని ఆయన అన్నారు. నది దగ్గర ట్రాక్టర్లు పెట్టి ఇసుకను అమ్ముకుంటు ఇల్లీగల్‌ దందా చేస్తున్న ప్రజాప్రతినిధులకు రైతుల గురించి ఆలోచించే టైమ్‌ ఎక్కడ ఉందని పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాలు వస్తున్నాయి ఇప్పటివరకు వానాకాలం ప్రణాళిక లేదు.. రబీ ధాన్యం కొనుగోలు పూర్తి కాలేదని అన్నా రు. కమీషన్లు వచ్చే కాళేశ్వరమే కేసీఆర్‌కు గుర్తుందని ఎద్దేవా చేశారు. డీజీల్‌ పెట్రోల్‌ రేట్లు 2014లో ఎంత ఉన్నాయో ఇప్పు డు ఎంత పెరిగాయో తెలుసుకొని మాట్లాడాలన్నారు. 2014లో టీఆర్‌ఎస్‌ నాయకుల ఆస్తులు ఎన్ని ఉన్నాయో.. ఇప్పుడు ఎంత ఉన్నాయో ప్రకటిస్తే మేము 2014లో ఉన్న ఇందన రేట్ల ను అమలు చేస్తామని ఆ ధైర్యం ఉందా అని సవాల్‌ చేశారు. అంతకుముందు ఆయన బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రాం చంద్రారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడ్డం కృష్ణారెడ్డి, ఇన్‌చార్జి వెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి స్నిగ్దారెడ్డి, మునిసిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ అక్కల రమా తదితరులు పాల్గొన్నారు.

 టీఆర్‌ఎస్‌లో ఫాంహౌజ్‌ల కల్చర్‌

టీఆర్‌ఎస్‌లో ఫాంహౌజ్‌ల కల్చర్‌ కొనసాగుతున్నది. పెద్ద సార్‌ ఒకఫామ్‌ హౌజ్‌, కొడుకు ఒకటి, కూతురు ఒకటి, అల్లుడు ఒకటి కడితే.. జిల్లా వ్యవసాయశాఖ మంత్రి నేనేమి తక్కువనా అంటూ తల్లిదండ్రుల ఆస్తి దగ్గర ఒకటి, మక్తల్‌ కేంద్రంలో ఒకటి, కృష్ణానది దగ్గర 80 ఎకరాల అసలు, 40 ఎక రాల కొసరులో ఫామ్‌హౌజ్‌లు కట్టుకొని రైతులను మాత్రం గాలికొదిలేశారని రఘునందన్‌రావు విమర్శించారు. వైద్య ఆరోగ్యశాఖలో పోస్టులు అమ్ముకుంటున్నారని పత్రికలు ఘోషిస్తుంటే ఆరోగ్యశాఖ మంత్రి నీతి వ్యాఖ్యలు చెబుతున్నా డన్నారు. బీజేపీ వచ్చిన తర్వాత మతపిచ్చి ముదురిందంటు న్నారు.. బీజేపీ వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడ మతఘర్షణలు జరగలేదన్నారు. కానీ మీరు పాలిస్తున్న తెలంగాణలో భైంసా, నిర్మల్‌, నిజామాబాద్‌, ముథోల్‌ మత ఘర్షణలు జరిగా యన్నారు. నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయిన తర్వాత మతఘర్షణలు జరిగిన రాష్ట్రం దేశంలో ఒక తెలంగాణలోనేనని అన్నారు. 

Updated Date - 2022-05-29T05:51:45+05:30 IST