హామీల అమలులో కేసీఆర్‌ ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2022-05-19T04:57:28+05:30 IST

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్‌ అన్నారు.

హామీల అమలులో కేసీఆర్‌ ప్రభుత్వం విఫలం
మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్‌

 - సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, మే 18: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్‌ అన్నారు.  జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో బుధవారం పార్టీ మండల, పట్టణ కార్యదర్శు లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఎంపీ బినయ్‌ విశ్వం అక్రమంగా హనుమకొండలో అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. సీఎం కేసీఆర్‌ నిరుపేదలకు డబు ల్‌ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, రైతు రుణమాఫీ , నిరుద్యోగ భృతి ఇస్తానని హామీలు ఇచ్చి ఇప్పటి వరకు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. హామీలను అమలు చే యాలని కోరితే అరెస్టులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. జూలై 23,24 తేదీల్లో మంచిర్యాలలో సీపీఐ జిల్లా మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభల్లో భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రామడు గు లక్ష్మణ్‌, ఖలీందర్‌ ఆలీఖాన్‌, మేకల దాసు, చిప్ప నర్సయ్య, మామి డాల రాజేశం, సుదర్శన్‌, మల్లయ్య, చంద్రశేఖర్‌, దేవి పోచన్న,  గుండ మాణిక్యం, లక్ష్మీనారాయణ, సన్నీ, బానేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-19T04:57:28+05:30 IST