కేసీఆర్ ఒక అపరిచితుడు: షర్మిల

ABN , First Publish Date - 2022-04-29T02:08:43+05:30 IST

కేసీఆర్ ఒక అపరిచితుడు అని వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు

కేసీఆర్ ఒక అపరిచితుడు: షర్మిల

భద్రాద్రి కొత్తగూడెం: కేసీఆర్ ఒక అపరిచితుడు అని వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. జిల్లాలోని ముల్కలపల్లి మండలం మాదారంలో షర్మిల మాట ముచ్చట నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికలు వస్తున్నాయి అంటే ఆకాశంలో చందమామ అంటారన్నారు.  ఎన్నికలు వస్తుంటే గాడిదను ఆవు అని నమ్మించే రకం కేసీఆర్ అని ఆమె ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను రెండుసార్లు నమ్మింది చాలని, ఇక నమ్మకండని ఆమె పిలపునిచ్చారు. కేసీఆర్ ఛాతీలో ఉన్నది గుండె కాదు బండ అని ఆమె మండిపడ్డారు. రాష్ట్రంలో ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచారని ఆమె ఆరోపించారు. 

Updated Date - 2022-04-29T02:08:43+05:30 IST