
వరంగల్: సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సెటైర్లు వేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ చేతిలో మోసపోనివారు ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు. కొడంగల్ అభివృద్ధిపై కేటీఆర్ చర్చకు రావాలని సవాల్ విసిరారు. రైతులు చనిపోతుంటే కేసీఆర్ ఒక్క కుటుంబాన్ని పరామర్శించలేదన్నారు. వెంటనే ఐకేపీ కేంద్రాలు తెరిచి వడ్లు కొనాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ పాలనలో పేదలకు ఎలాంటి సాయం అందలేదని రేవంత్‌రెడ్డి విమర్శించారు.
ఇవి కూడా చదవండి