స్టాలిన్‌తో కేసీఆర్ భేటీ

ABN , First Publish Date - 2021-12-14T21:53:41+05:30 IST

తమిళనాడు సీఎం స్టాలిన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్

స్టాలిన్‌తో కేసీఆర్ భేటీ

చెన్నై: తమిళనాడు సీఎం స్టాలిన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు. యాదాద్రి ప్రారంభానికి స్టాలిన్‌‌ను ఆహ్వానించారు. 


 రెండు రోజుల పర్యటన నిమిత్తం కుటుంబ సమేతంగా తమిళనాడుకు సీఎం కేసీఆర్‌  వెళ్లిన సంగతి తెలిసిందే.  తిరుచ్చి జిల్లా శ్రీరంగంలోని రంగనాథస్వామిని దర్శించుకున్నారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో సీఎంతోపాటు ఆయన సతీమణి కె.శోభ, కుమారుడు, మంత్రి కేటీఆర్‌, ఎంపీ సంతో్‌షకుమార్‌, కేటీఆర్‌ సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కూతురు అలేఖ్య తదితరులు తరలివెళ్లారు. 


స్థానికంగా ఓ హోటల్‌లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆలయానికి వెళ్లిన కేసీఆర్‌ బృందానికి తమిళనాడు పురపాలకశాఖ ’మంత్రి కేఎన్‌ నెహ్రూ, కలెక్టర్‌ శివరావు, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తొలుత ఆలయ గజరాజు వద్ద ఆశీస్సులు తీసుకున్న కేసీఆర్‌ కుటుంబీకులు.. శ్రీరంగనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆల యం మొత్తం కలియతిరిగి పరిశీలించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతూ రంగనాథ స్వామి ని దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు.

Updated Date - 2021-12-14T21:53:41+05:30 IST