వరి ధాన్యంపై కేసీఆర్ రాజకీయం: డీకే అరుణ

ABN , First Publish Date - 2022-03-22T22:29:53+05:30 IST

పీకే టీమ్ సలహాతోనే వరి ధాన్యంపై కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని బీజేపీ నాయకురాలు

వరి ధాన్యంపై కేసీఆర్ రాజకీయం: డీకే అరుణ

హైదరాబాద్: పీకే టీమ్ సలహాతోనే వరి ధాన్యంపై కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని బీజేపీ నాయకురాలు డీకే అరుణ అన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కేసీఆర్‌కు నిద్రలేకుండా చేస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి పూర్తిగా పడకేసిందని ఆరోపించారు. సెంటిమెంట్‌తో మరోసారి రైతులను మోసగించడానికి రెడీ అవుతున్నారన్నారు. రాష్ట్రంలో వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. నాణ్యత లేని రోడ్లు వేయడానికి సహకరిస్తున్న సర్పంచ్‌లు తగిన మూల్యం చెల్లిస్తారని హెచ్చరించారు. కాశ్మీర్‌ ఫైల్స్ సినిమాపై కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని అరుణ మండిపడ్డారు. పర్యావరణాన్ని నాశనం చేసేందుకే జీవో 111 రద్దు అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 111 రద్దు చేస్తే హైదరాబాద్ తన అస్తిత్వం కోల్పోతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 111 కోసం హైదరాబాద్‌ ప్రజలు పోరాటానికి సిద్ధం కావాలని ఆమె పిలుపునిచ్చారు. 

Updated Date - 2022-03-22T22:29:53+05:30 IST