వరదలపై కేసీఆర్‌ సమీక్ష

ABN , First Publish Date - 2022-07-14T00:45:50+05:30 IST

రాష్ట్రంలో వరదలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.

వరదలపై కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌: రాష్ట్రంలో వరదలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. మంత్రులతో సీఎం ఫోన్‌లో మాట్లాడారు. దేవాదుల ప్రాజెక్టు ముంపుపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నియోజకవర్గాలను వదిలి ప్రజాప్రతినిధులు బయటకు రావొద్దని సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దన్నారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వరదల వల్ల రవాణా, విద్యుత్‌ సమస్యలు తలెత్తకుండా చూడాలని కేసీఆర్ ఆదేశించారు. వరదలకు తెగిపోతున్న జాతీయ, రాష్ట్ర రహదారుల పునరుద్దరణకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఎక్కడా ప్రాణహాని జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ప్రజల రక్షణ చర్యలకు కావాల్సిన నిధుల విడుదలకు ఆర్థికశాఖకు కేసీఆర్ ఆదేశాలిచ్చారు.


దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం మంగళవారం తీవ్ర అల్పపీడనంగా మారి బలపడినట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది ఒడిశా తీర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. ఇందుకు అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని తెలిపింది. దీంతో తెలంగాణలో బుధ, గురువారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 


Updated Date - 2022-07-14T00:45:50+05:30 IST