దేశ రాజకీయాల్లోనూ కేసీఆర్‌దే విజయం: శ్రీనివాస్‌గౌడ్‌

ABN , First Publish Date - 2022-06-14T02:09:14+05:30 IST

సీఎం కేసీఆర్‌ దేశ రాజకీయాల్లో వంద శాతం విజయం సాధిస్తారని మంత్రి శ్రీనివాసగౌడ్‌ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆయన

దేశ రాజకీయాల్లోనూ కేసీఆర్‌దే విజయం: శ్రీనివాస్‌గౌడ్‌

తిరుమల: సీఎం కేసీఆర్‌ దేశ రాజకీయాల్లో వంద శాతం విజయం సాధిస్తారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ ఆలోచనలతో దేశం బాగుపడుతుందని, అనేక మంది మేధావులు ఆలోచిస్తున్నారని తెలిపారు. గుడి పేరుతో బీజేపీ రాజకీయం చేసిందే తప్ప గుడిని కట్టి హిందుత్వాన్ని విస్తరించాలనే ఆలోచన లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ప్రస్తుతం సరైన నాయకత్వం లేదనే విషయం అందరికీ తెలుసన్నారు. అందుకే ప్రత్యామ్నాయంగా ఎవరు వస్తారని దేశప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రధాని పదవి కోసం కేసీఆర్‌, కేంద్ర రాజకీయాల్లోకి రావడం లేదని, దేశప్రజలను చైతన్య పరచడానికి వస్తున్నారని ఓ ప్రశ్నకు శ్రీనివాస్‌గౌడ్‌ బదులిచ్చారు. 

Updated Date - 2022-06-14T02:09:14+05:30 IST