మళ్లీ ఫామ్‌హౌస్‌కు కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-05-28T09:13:27+05:30 IST

హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌ మళ్లీ ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. శుక్రవారం ఉదయం నుంచి ప్రగతి భవన్‌లోనే ఉన్న ముఖ్యమంత్రి సాయంత్రం

మళ్లీ ఫామ్‌హౌస్‌కు కేసీఆర్‌

-రాలేగావ్‌ సిద్ధి పర్యటన రద్దు

-2, 3 తేదీల్లో వెళ్లే అవకాశం

-29 లేదా 30 తేదీల్లో బెంగాల్‌, బిహార్‌ పర్యటనపై సందిగ్ధత

హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌ మళ్లీ ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. శుక్రవారం ఉదయం నుంచి ప్రగతి భవన్‌లోనే ఉన్న ముఖ్యమంత్రి సాయంత్రం ఫామ్‌హౌ్‌సకు బయలుదేరి వెళ్లారు. గురువారం ఉదయం బెంగళూరు పర్యటనకు వెళ్లిన కేసీఆర్‌.. రాత్రి తిరిగి వచ్చిన తర్వాత రెండు వివాహాలకు హాజరయ్యారు. నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం శుక్రవారం ఉదయాన్నే మహారాష్ట్రలోని రాలేగావ్‌ సిద్ధికి కేసీఆర్‌ వెళ్లాల్సి ఉంది. ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేను కలిసి, అటు నుంచి అటే షిర్డీకి వెళ్లి సాయిబాబా దర్శనం చేసుకోవాల్సి ఉండగా.. ఆ పర్యటన రద్దయింది. వచ్చే నెల 2 లేదా 3న రాలేగావ్‌ సిద్ధికి కేసీఆర్‌ వెళ్లే అవకాశమున్నట్లు తెలిసింది. కాగా, 29 లేదా 30న పశ్చిమబెంగాల్‌, బిహార్‌ రాష్ట్రాల పర్యటనకు కేసీఆర్‌ వెళతారని గతంలోనే సీఎంవో ప్రకటించింది. అయితే, శుక్రవారం నాటి పర్యటన రద్దు కావడం, సీఎం కేసీఆర్‌ ఫామ్‌హౌ్‌సకు వెళ్లిన నేపథ్యంలో బెంగాల్‌, బిహార్‌ పర్యటనపై సందిగ్దం నెలకొంది. దీనిపై సీఎంవో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ నుంచి తిరిగి వస్తే తప్ప.. పర్యటన గురిం చి ఏమీ చెప్పలేమని సీఎంవో వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కాగా, గత నెల 30న ఎర్రవల్లిలోని ఫామ్‌హౌ్‌సకు వెళ్లిన కేసీఆర్‌ 16 రోజుల పాటు అక్కడే ఉండి ఈ నెల 16నే ప్రగతి భవన్‌కు తిరిగి వచ్చారు. ఈ నెల 20న ఢిల్లీ, చంఢీగఢ్‌ పర్యటనకు వెళ్లి 22న తిరిగి వచ్చారు. 23న ప్రగతి భవన్‌లోనే ఉండి, 24న మళ్లీ ఫామ్‌హౌ్‌సకు వెళ్లారు. 25న ప్రగతి భవన్‌కు వచ్చి, 26న ఉదయం బెంగళూరు పర్యటనకు వెళ్లారు. తాజాగా శుక్రవారం సాయంత్రం మళ్లీ ఫామ్‌హౌ్‌సకు వెళ్లడంతో నెల రోజుల్లోనే మూడోసారి వెళ్లినట్లయింది.

తెలంగాణ వైతాళికుడు సురవరం: కేసీఆర్‌

సురవరం ప్రతాపరెడ్డి జయంతి (శనివారం)ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్‌ ఆయన సేవలను స్మరించుకున్నారు. రచయితగా, పరిశోధకుడిగా, సంపాదకుడిగా, ఉద్యమకారుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా సామాజిక సేవ చేసిన తెలంగాణ వైతాళికుడు సురవరం అని సీఎం కొనియాడారు. తెలంగాణపై వివక్షను అప్పుడే ఎదిరించి, గోలకొండ పత్రిక ద్వారా తెలంగాణ సాహితీ ఆత్మగౌరవాన్ని చాటారని పేర్కొన్నారు. తెలంగాణ గడ్డ గర్వించదగ్గ బిడ్డ సురవరం అని ప్రశంసించారు. తెలంగాణ పోరాటంలో సుర వరం స్ఫూర్తి ఇమి డి ఉందన్నారు. సురవరం జయంతి ఉత్సవాలను ప్రతిఏటా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని గుర్తుచేశారు. ఆయన పేరిట పలు రంగా ల ప్రముఖులకు గౌరవ పురస్కారాలను రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్నట్టు తెలిపారు. 

Updated Date - 2022-05-28T09:13:27+05:30 IST