
హైదరాబాద్: కేసీఆర్ ఒక తుగ్లక్ ముఖ్యమంత్రి అని బీజేపీ నేత వివేక్ ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కమీషన్ల కొరకు ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టాడని ఆరోపించారు. భారత్ రాష్ట్ర సమితి గురించి కేసీఆర్ ఆలోచిస్తున్నారని తెలిపారు. కాళేశ్వరం వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వివేక్ డిమాండ్ చేశారు.