కేసీఆర్‌ పర్యటనలో పోలీసుల అత్యుత్సాహం

ABN , First Publish Date - 2021-06-22T05:20:24+05:30 IST

కేసీఆర్‌ పర్యటనలో పోలీసుల అత్యుత్సాహం

కేసీఆర్‌ పర్యటనలో పోలీసుల అత్యుత్సాహం
పోలీసులు వాహనాన్ని అడ్డుకోవడంతో కలెక్టరేట్‌కు నడుచుకుంటు వెళ్తున్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి

బారికేడ్లతో నగర రోడ్ల దిగ్బంధం

తీవ్ర ఇబ్బందులు పడిన వాహనదారులు

నర్సంపేట ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, బీజేపీ కార్పొరేటర్‌కు చేదు అనుభవం 


హన్మకొండ, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరంగల్‌ రాక సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సామాన్యులే కాదు ప్రజాప్రతినిధులను సైతం సీఎంను కలిసేందుకు అనుమతించలేదు. సీఎం ప్రయాణించే మార్గాల్లో అడుగడుగునా బారికేడ్లు ఏర్పాటు చేసి నగరాన్ని దిగ్బంధం చేశారు. వాహనాలను ఎక్కడికక్కడే నిలిపివేశారు. ఇతర మార్గాల నుంచి వెళ్లేందుకు వీలుగా కనీసం వన్‌వే కూడా పెట్టలేదు. దీంతో వాహనాదారులు తికమకపడ్డారు. ఆగ్రహించిన వాహనదారులు కొన్నిచోట్ల పోలీసులతో గొడవకు దిగారు. సీఎం పర్యటన సందర్భంగా నగరంలో పెద్దఎత్తున ట్రాఫిక్‌ ఆంక్షలను విధించారు. సీఎం వచ్చి వెళ్లే వరకు హన్మకొండ సుబేదారి ఆర్ట్స్‌ కళాశాల నుంచి ఎంజీఎం ఆస్పత్రి వరకు ఈ ఆంక్షలు కొనసాగాయి. ట్రాఫిక్‌ మళ్లింపుతో ఉద్యోగులు, కార్మికులు పనులకు ఆలస్యంగా వెళ్లాల్సి వచ్చింది.  


‘పెద్ది’కి చేదు అనుభవం

సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యే పెద్ది సు దర్శన్‌ రెడ్డి సైతం పోలీసుల నుంచి చేదు అ నుభవం ఎదుర్కొన్నారు. తాను ఎమ్మెల్యేనని చెప్పినా వారు వినిపించుకోలేదు. ముందుకు వెళ్లనిచ్చేది లేదన్నారు. దీంతో ఆయన తన వాహనాన్ని పోలీసు హెడ్‌క్వార్టర్‌ వద్దే వదిలేసి కలెక్టరేట్‌ వరకు నడిచి వెళ్లారు. మార్గమధ్యలో ఆయన అభిమానులు, కార్యకర్తలు ద్విచక్రవాహనంపై తీసుకెళ్లేందుకు యత్నించ గా నిరాకరించారు. తాను కాలినడకనే కలెక్టరేట్‌కు చేరుకుంటానంటూ ముందుకు కదిలా రు. అంతకుముందు జయశంకర్‌ స్మృతివనం వద్ద కూడా ఆయనకు అవమానం ఎదురైం ది. అక్కడ కూడా ఆయనను పోలీసులు లో నికి వెళ్లనివ్వలేదు. జయశంకర్‌ విగ్రహానికి పూలమాల వేసే అవకాశం ఇవ్వలేదు. అయి తే తనకు  అవమానం జరిగిందని వాట్సా్‌ప లో వచ్చిన వార్తలను ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డి తోసిపుచ్చారు. తనకు ఎలాంటి అవమానం జరగలేదన్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షల దృష్ట్యా పో లీసులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దని, ఉన్నందు వల్ల నడిచి వెళ్లానని చెప్పారు.


కార్పొరేటర్‌కు చెక్‌

కార్పొరేటర్లను సైతం సీఎం పాల్గొనే ప్రాం గణాల్లోకి అడుగుపెట్టనివ్వలేదు. హన్మకొండ బాలసముద్రంలోని జయశంకర్‌ స్మృతివనం (ఏకశిల పార్క్‌)లోని జయశంకర్‌ విగ్రహానికి పూలమాల వేయడానికి వచ్చిన 30వ డివిజన్‌ బీజేపీ కార్పొరేటర్‌ రావుల కోమల కిషన్‌ను పోలీసులు అడ్డుకున్నారు. జయశంకర్‌ సార్‌ వర్ధంతి అని, ఆయన విగ్రహానికి పూలమాల వేసేందుకు అనుమతించాలని ఎంత కోరినా ససేమిరా అన్నారు. దీంతో ఆమె పూ లమాల వేయకుండానే వెనుదిరిగారు.  మీడి యా ప్రతినిధుల పట్ల కూడా పోలీసులు అ త్యుత్సాహం ప్రదర్శించారు. పాస్‌లున్నప్పటికీ లోనికి అనుమతించలేదు. దీనితో వారంతా బయటనే ఉండాల్సి వచ్చింది.





Updated Date - 2021-06-22T05:20:24+05:30 IST