చినజీయర్‌ నిర్ణయించిన ముహూర్తం ప్రకారమే మహాకుంభ సంప్రోక్షణ: గీతారెడ్డి

Published: Sun, 27 Mar 2022 17:51:14 ISTfb-iconwhatsapp-icontwitter-icon
చినజీయర్‌ నిర్ణయించిన ముహూర్తం ప్రకారమే మహాకుంభ సంప్రోక్షణ: గీతారెడ్డి

యాదాద్రి: చినజీయర్‌ నిర్ణయించిన ముహూర్తం ప్రకారమే యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ నిర్వహిస్తామని యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ జీయర్ స్వామికి ప్రత్యేక ఆహ్వానం పంపలేదన్నారు. అందరూ ఆహ్వానితులే, శిలాఫలకం ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. సోమవారం ఉదయం 11:55కి కార్యక్రమం ఉంటుందని, ఉదయం స్వామివారికి పూర్ణాహుతి నిర్వహిస్తామని ప్రకటించారు. బాలాలయం నుంచి ప్రధానాలయానికి స్వామివారిని తీసుకెళ్లి.. గర్భాలయంలో అధిష్టింపజేస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు శోభా యాత్రలో పాల్గొంటారని చెప్పారు. భక్తులందరికి అన్నప్రసాదం అందేలా ఏర్పాట్లు చేస్తామని గీతారెడ్డి తెలిపారు.


యాదాద్రి ఆలయ మహా కుంభ సంప్రోక్షణ సందర్భంగా బాలాలయంలో పంచ కుండాత్మక మహాయాగ పర్వాలు 7వ రోజుకు చేరుకున్నాయి. ఈరోజు ఉదయం శాంతిపాఠం, చతుస్థానార్చన, మూల మంత్ర హావనములు, అష్టోత్తర శత కలశాభిషేకం, నిత్య లఘుపూర్ణాహుతి నిర్వహించారు. సాయంత్రం సామూహిక శ్రీవిష్ణు సహస్ర నామ పారయాణం, మూలమంత్ర హావనములు, చతు:స్థానార్చనలు, షోడశ కళాన్యాసహోమములు, పంచశయ్యధివాసం, నిత్య లఘు పూర్ణాహుతి నిర్వహించనున్నారు. రేపే యాదాద్రి స్వయంభు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ మహా కుంభ సంప్రోక్షణ జరుగనుంది. 


ఇందుకోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈరోజు రాత్రికి కుటుంబ సమేతంగా సీఎం కేసీఆర్ దంపతులు యాదాద్రికి చేరుకోనున్నారు. ప్రధానాలయం పునర్నిర్మాణం దృష్ట్యా 2016 ఏప్రిల్ 21 నుంచి బాలాలయంలో భక్తులకు దర్శనాలు కల్పించారు. నేటితో బాలాలయంలో భక్తులకు దర్శనాలు  ముగియనున్నాయి. రేపు యాదాద్రి మహా కుంభ సంప్రోక్షణ ఉదయం 11:55 గంటల అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి భక్తులకు స్వయంభువు లక్ష్మీ నరసింహస్వామి దర్శనాలు కల్పించనున్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.