ఫిట్‌బిట్‌ వాచీల్లో గురకపై నిఘా

ABN , First Publish Date - 2021-09-18T06:23:15+05:30 IST

కొన్ని విషయాల్లో కరోనాకు జనాలు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే. ఆరోగ్యానికి సంబంఽధించి సూక్ష్మ స్థాయిలో అవేర్‌నెస్‌ ప్రజల్లో పెరిగింది...

ఫిట్‌బిట్‌ వాచీల్లో గురకపై నిఘా

కొన్ని విషయాల్లో కరోనాకు జనాలు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే. ఆరోగ్యానికి సంబంఽధించి సూక్ష్మ స్థాయిలో అవేర్‌నెస్‌ ప్రజల్లో పెరిగింది. సరిగ్గా ఆ జాగ్రత్తలే కంపెనీల సరికొత్త ఆవిష్కరణలకు మార్గాన్ని సుగమం చేస్తోంది. ఫిట్‌బిట్‌ వాచ్‌ తాజాగా నిద్రలో పెట్టే గురకపై నిఘాకు సన్నద్ధమైంది. వెర్సా 3, సెన్స్‌ స్మార్ట్‌వాచీల్లో హెల్త్‌ ఫీచర్లలో భాగంగా గురకపై నిఘాను ప్రవేశపెట్టింది. ‘స్నోర్‌ అండ్‌ నాయిస్‌ డిటెక్ట్‌’ అని పేరుపెట్టింది. వ్యక్తి  నిద్రిస్తున్నప్పుడు పెట్టే గురక సమాచారాన్ని ఈ ఫీచర్‌ అందిస్తుంది. నిద్ర నుంచి లేచిన తరవాత వద్దనుకుంటే ఆ సమాచారాన్ని డిలీట్‌ చేసుకోవచ్చు.  అయితే ఇక్కడ చిన్న తిరకాసు ఉంది. సమాచారం పొందాలంటే వాచీ బెటర్‌ స్థాయి 40 శాతానికి మించి ఉండాలి. దీనికోసం ఫిట్‌ బిట్‌ ప్రీమియమ్‌ కింద నెలకు పది డాలర్లు లేదంటే ఏటా 80 డాలర్లను వసూలు చేస్తోంది. మీ వాచీలో ఈ ఫీచర్‌ ఉందా లేదా అనే విషయం తెలుసుకునేందుకు ముందు స్లీప్‌ పేజీలోకి వెళ్ళాలి. ‘చెక్‌ ఫర్‌ స్నోరింగ్‌’ సెక్షన్‌ ఉందా లేదా అన్నది తెలుసుకోవాలి. అదెలా పనిచేస్తుందో తెలుసుకోవాలంటే ‘లెర్న్‌ మోర్‌’ విభాగంలోకి వెళ్ళాల్సి ఉంటుంది. యాపిల్‌ వాచ్‌ ప్రస్తుతం ‘హైడ్రేషన్‌ లెవెల్స్‌’ తెలుసుకోవడంపై పని చేస్తోంది. నెలక్రితమే అమెరికా పేటెంట్‌ విభాగానికి ఈ విషయమై దరఖాస్తు కూడా చేసింది. 


Updated Date - 2021-09-18T06:23:15+05:30 IST