గంజాయి, గుడుంబాపై నిఘా ఉంచాలి

ABN , First Publish Date - 2021-10-26T04:51:11+05:30 IST

నిషేధ మత్తుప దార్థాలు విక్రయం, గుడుంబా తయారీపై నిరం తర నిఘా ఏర్పాటు చేయాలని, ఎక్కడ వీటి విక్ర యాలు జరిగినా కఠినచర్యలు తీసుకోవాలని ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ ఖురేషి ఆదేశించా రు.

గంజాయి, గుడుంబాపై నిఘా ఉంచాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌

- విక్రయదారులపై కఠినచర్యలు

- ఎక్సైజ్‌ శాఖ డీసీ ఖురేషి

మహబూబ్‌నగర్‌, అక్టోబరు 25: నిషేధ మత్తుప దార్థాలు విక్రయం, గుడుంబా తయారీపై నిరం తర నిఘా ఏర్పాటు చేయాలని, ఎక్కడ వీటి విక్ర యాలు జరిగినా కఠినచర్యలు తీసుకోవాలని ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ ఖురేషి ఆదేశించా రు. ముప్పైరోజుల్లో వీటి కట్టడి కోసం ప్రణాళిక రూపొందించాలని సూచించారు. గంజాయి, గుడుంబా కట్టడి కోసం తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం జిల్లా పరిషత్‌  సమావేశ మందిరం లో ఎక్సైజ్‌ అధికారులతో సమావేశం నిర్వహించా రు. గంజాయి వల్ల యువత మత్తుకు బానిసల వుతున్నారని, గంజాయి తయారీచేసే ప్రదేశాలు, విక్రయించే స్థలాలు, గంజాయి తీసుకునే వ్యక్తుల ను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాల న్నారు. ఎక్కడైనా వ్యవసా య పొలాల్లో పంటల నడుమ గంజాయి మొక్క లు పెంచుతున్నట్లైతే అలాంటి వాటిని గుర్తించి సంబంధిత వ్యక్తులపై కేసులు న మోదు చేయా లన్నారు. గంజాయి విక్రయించే స్థావరాలపై రహస్యంగా దృష్టి సారించాలని పేర్కొ న్నారు. ఇం దుకు రెవెన్యూ, పోలీసులతో సమన్వ యం  చేసుకో వాల్సిన అవసరం ఉందన్నారు. ఉ మ్మడి జిల్లాలోనే రాష్ట్రంలో ముందుగా నిషేధించి గుడుంబా రహిత జిల్లాగా ప్రకటించు కోవడం జ రిగిందని గుర్తు చేశారు. చాలామంది సారా త యారు చేస్తున్న వారు వృత్తిని మానేయడంతో   పునరావాసం కింద రుణాలు ఇస్తున్నామని,  పాల మూరు జిల్లాలో నే 529మందికి రుణాలిచ్చామని, వారంతా రుణాలను సద్వినియోగం చేసుకొని జీవనం సాగిస్తున్నారా లేదా మళ్లీ సారా తయారీ చేస్తున్నా రా వంటి వివరాలు సేకరించాలన్నారు. కరోనా తరువాత ఎవరైనా కొత్తగా సారా తయారు చేస్తున్నారా వంటి వివరాలు తీసుకొని సారాను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడ ఎలాంటి సమాచారం వచ్చి నా సిబ్బంది వెళ్ళి చర్యలు చేపట్టాలని పేర్కొన్నా రు. ప్రభుత్వం గంజాయి, గుడుంబా విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నదని, ఈ విషయంలో ఎస్‌ హెచ్‌వోలు తమ సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్ర మత్తం చేస్తూ వాటిని నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.  సమావేశంలో ఎక్సైజ్‌ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ దత్తురాజ్‌గౌడ్‌, ఎస్‌ఈ సైదు లు, ఉమ్మడి జిల్లా ఎస్‌హెచ్‌వోలు, ఎస్సైలు, పీఎస్సైలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-26T04:51:11+05:30 IST