
ఆంధ్రజ్యోతి(28-03-2022)
కళ్లకు వేడిగాలి తగలకుండా కళ్లద్దాలు ధరించాలి. దుమ్ము, ధూళి నుంచి రక్షణ కోసం ఇవి తప్పనిసరి.
కళ్లు పప్ఫీగా ఉన్నా, దురద పెడుతున్నా గ్రీన్ టీ బ్యాగులను ఉపయోగించాలి. గ్రీన్ టీ బ్యాగులను కళ్లపై పెట్టుకుంటే అసౌకర్యం తగ్గుతుంది. టీ బ్యాగులను ముందుగా నీళ్లలో పెట్టాలి. తరువాత పావుగంట పాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. టీ బ్యాగులు చల్లబడిన తరువాత కళ్లపై పదినిమిషాలు పెట్టుకోవాలి. కీర దోసను ముక్కలుగా కట్ చేసి కళ్లపై పెట్టుకున్నా కళ్లు రీఫ్రెష్ అవుతాయి.
కళ్ల దగ్గర, కను బొమ్మల ప్రాంతంలో చేతి వేళ్లతో నెమ్మదిగా మర్దన చేసినా ఫలితం ఉంటుంది.
సరైన నిద్ర లేకపోతే దాని ప్రభావం కళ్లపై కనిపిస్తుంది. అందుకే కనీసం ఏడు నుంచి తొమ్మిది గంటల పాటు నిద్ర ఉండేలా చూసుకోవాలి. పడుకునే ముందు ఫోన్ చూడటం మానేయాలి.
కంప్యూటర్‌పై పనిచేసే వాళ్లు మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవాలి. కొద్దిసేపు కళ్లు మూసుకోవడం ద్వారా కంటిపై పడే ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.
కళ్లు మంటగా ఉన్నా, ఇరిటేషన్ వస్తున్నా కాటన్ గుడ్డను చల్లటి నీటిలో ముంచి కళ్లపై పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కళ్ల అలసట కూడా తగ్గిపోతుంది.