పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

ABN , First Publish Date - 2022-10-08T04:46:02+05:30 IST

వ్యాధులు వ్యాప్తిచెందకుండా ప్రజలు తమ ఇంటి సరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ శాంతికళ సూచించారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
లార్వా, ఫీవర్‌ సర్వేలో ప్రజలకు సూచనలు ఇస్తున్న డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ శాంతికళ

ప్రొద్దుటూరు క్రైం, అక్టోబరు 7 : వ్యాధులు వ్యాప్తిచెందకుండా  ప్రజలు తమ ఇంటి సరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ శాంతికళ సూచించారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక వినాయకనగర్‌లో  వైద్య సిబ్బంది ఇంటింటి లార్వా, ఫీవర్‌ సర్వేను నిర్వహించారు. ఈ సర్వేను పర్యవేక్షించిన డిప్యూటీ డీఎంహెచ్‌వో, పలు ఇళ్లల్లో బయలు ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండటాన్ని గమనించి, వారికి పలు సూచనలు చేశారు. పాత టైర్లు, కుండల్లో, రోళ్లల్లో నీరు నిల్వ ఉన్నట్లయితే, వాటి ద్వారా లార్వా వృద్ధి చెంది దోమలు వ్యాపిస్తాయన్నారు. దోమల వల్లే మలేరియా, డెంగ్యూ లాంటి విషజ్వరాలు ప్రబలుతాయన్నారు. ముఖ్యంగా ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని సూచించారు. కార్యక్రమంలో హెల్త్‌ ఎడ్యుకేటర్‌ వెంకటేశ్వర్లు, ఏఎన్‌ఎం నారాయణమ్మ, ఆశాలు పాల్గొన్నారు. 

డ్రైడేను తప్పక పాటించాలి 

కాశినాయన అక్టోబరు 7: వారంలో ప్రతి శుక్రవారాన్ని డ్రైడేగా పాటించాలని మండల కమ్యూనిటీ హెల్త్‌ అధికారి నిర్మల, ఆరోగ్య విస్తరణాధికారి సుబ్బరాయుడు పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని నర్సాపురం సావిశెట్టిపల్లె గ్రామాల్లో డ్రైడే ఫ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ డెంగ్యూ,మలేరియా, చికెన్‌గున్యా లాంటి సీజనల్‌ వ్యాధుల పట్లప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. దోమలు ఉత్పత్త్తి కాకుండా మురుగునీటి గుంతల్లో అబేట్‌ ద్రావణం చల్లించారు. ఈకార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకుడు బాలయ్య, సిబ్బంది బీబి, సువార్త, ప్రసన్నలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

బ్రహ్మంగారిమఠం..: పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్‌ రాయపురెడ్డి లక్ష్మీదేవి పేర్కొన్నారు. తోట్లపల్లి పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన గ్రామీణ ఆరోగ ్య పారిశుధ్య పోషకాహార కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.   ఈ కార్యక్రమంలో హెల్త్‌ అసిస్టెంట్‌ రామతీర్థం , ఏఎన్‌ఎంలు లలితమ్మ, అంగన్‌వాడీ వర్కర్‌ రాణి, ఆశలు బాలమ్మ  పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-08T04:46:02+05:30 IST