చాణక్యనీతి: ఎవరినైనా పరీక్షించాలనుకుంటే.. ఈ విషయాలు గుర్తుంచుకోండి!

ABN , First Publish Date - 2022-05-09T12:16:33+05:30 IST

ఆచార్య చాణక్యుని విధానాలు, ఆలోచనలు...

చాణక్యనీతి: ఎవరినైనా పరీక్షించాలనుకుంటే.. ఈ విషయాలు గుర్తుంచుకోండి!

ఆచార్య చాణక్యుని విధానాలు, ఆలోచనలు కాస్త కఠినంగా అనిపించినా అవి జీవిత సత్యాలుగా నిరూపితమయ్యాయి.  జీవితంలో ఎదురయ్యే ప్రతి పరీక్షలో చాణక్య తెలిపిన విధానాలు ఎంతగానో సహాయపడతాయి. ఎదుటివ్యక్తి ఎలాంటివాడో తెలుసుకునేందుకు ఆచార్య చాణక్య కొన్ని విషయాలు తెలిపారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆచార్య చాణక్య తెలిపిన వివరాల ప్రకారం బంగారం స్వచ్ఛతను తెలుసుకోవాలంటే దానిని రుద్దడం, కత్తిరించడం, వేడి చేయడం, కొట్టడం మొదలైన పనులు చేస్తారు. అదేవిధంగా మనిషిని పరీక్షించాలంటే అతనిలోని కొన్ని గుణాలను చూసి అతను ఎలాంటివాడో నిర్ధారించవచ్చని ఆచార్య చాణక్య తెలిపారు. 


త్యాగం

ఒక వ్యక్తిని పరీక్షించడానికి మొదటి మార్గం త్యాగం. ఆచార్య చాణక్య తెలిపిన వివరాల ప్రకారం ఇతరుల ఆనందం, సంతోషం కోసం తన ఆనందాన్ని వదులుకునే వ్యక్తిని మంచి వ్యక్తి అని అర్థం చేసుకోవచ్చు. అయితే ఎవరైనా మీ ముందు తాను మంచి వ్యక్తిని అని చెప్పుకుని సమయం వచ్చినప్పుడు తప్పించుకుని తిరిగితే అతను ఎవరికీ ప్రయోజనం అందించలేని వ్యక్తి అని చాణక్య అభివర్ణించారు. 

ప్రవర్తన

మీరు ఒక వ్యక్తి ఎలాంటివాడో తెలుసుకోవాలనుకుంటే అతని ప్రవర్తనను పరిశీలించండి. ఎందుకంటే మంచి వ్యక్తి అన్ని రకాల చెడులకు దూరంగా ఉంటాడు. ఇతరుల విషయంలో తప్పుగా మాట్లాడడు. ఏ తప్పుడు పనిలోనూ తల దూర్చడు. అలాంటి వారిని ఉత్తములుగా గ్రహించాలని ఆచార్య చాణక్య తెలిపారు. 

గుణాలు

ఒకరిని అర్థం చేసుకోవడానికి మూడవ మార్గం అతని గుణాలు. ప్రతి వ్యక్తికి కొన్ని మంచి లక్షణాలు, కొన్ని లోపాలు ఉంటాయి. ఎవరికైనా అబద్ధాలు చెప్పడం, అహంకారం ప్రదర్శించడం, ఎదుటివారిని అవమానించడం లాంటి లోపాలు ఉంటే మీరు వెంటనే అటువంటివారికి దూరంగా ఉండటం మంచిది.

పనులు

ఏ వ్యక్తి  అయినా మంచివాడా కాదా అని అతను చేసే పనుల ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఒక వ్యక్తి తప్పుడు మార్గంలో డబ్బు సంపాదిస్తే, తప్పుడు మార్గంలో నడిస్తే, అలాంటి వ్యక్తికి దూరంగా ఉండండి. ఎందుకంటే తప్పుడు వ్యక్తుల ప్రభావం మీ జీవితంపై తప్పక చెడు ప్రభావం చూపిస్తుంది.  

Read more