వానల్లో ఇలా...!

ABN , First Publish Date - 2020-10-05T05:30:00+05:30 IST

వానాకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇంటిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంపై దృష్టి పెట్టాలి...

వానల్లో ఇలా...!

వానాకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇంటిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంపై దృష్టి పెట్టాలి.


  1. ఇంటిని శుభ్రం చేయడానికి ఉపయోగిస్తున్న కెమికల్స్‌ కూడా అనారోగ్యానికి కారణం కావచ్చు. ఇంట్లోకి గాలి ధారాళంగా రాకపోతే వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంట్లో అలాంటి కెమికల్స్‌ వాడకం తగ్గించండి. గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూసుకోండి.
  2. బెడ్‌షీట్స్‌, పిల్లోలు శుభ్రంగా లేకపోతే డస్ట్‌మైట్స్‌ ఉండే అవకాశం ఉంటుంది. అవి ఎలర్జీకి కారణమవుతాయి. కాబట్టి పిల్లో షీట్స్‌, బెడ్‌ షీట్స్‌ శుభ్రంగా ఉతకండి. 
  3. ఇంట్లో స్వచ్ఛమైన గాలి లభించాలంటే గది మూలల్లో కొన్ని మొక్కలు ఏర్పాటు చేసుకోవాలి. గాలిలో కాలుష్యాన్ని తగ్గించే మొక్కలు మార్కెట్లో లభిస్తున్నాయి. అలాంటివి ఎంచుకుంటే మరీ మంచిది. అవుట్‌డోర్‌ గార్డెనింగ్‌తోపాటు ఇండోర్‌ గార్డెనింగ్‌ ఇప్పుడు చాలా అవసరం.
  4. ఇంటి ఆవరణలో కూరగాయల మొక్కలు పెంచుతున్నట్లయితే పెస్టిసైడ్స్‌ అస్సలు వాడకండి. ఇంట్లో బొద్దింకల కోసం ఉపయోగించే స్ర్పేలు, చీమల కోసం ఉపయోగించే మందుల వల్ల పిల్లల్లో ఆస్తమా, లెర్నింగ్‌ డిసేబులిటీస్‌ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి.
  5. ఇంట్లో సూర్యరశ్మి పడేలా చూసుకోండి. రోగనిరోధక శక్తి పెరగడానికి సహజకాంతి దోహదపడుతుంది. మెదడు పనితీరు బాగుంటుంది.

Updated Date - 2020-10-05T05:30:00+05:30 IST