Advertisement

‘వేదాళమ్‌’ రీమేక్‌ : చిరు చెల్లెలిగా ఎవరంటే..?

Oct 16 2020 @ 17:00PM

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం సక్సెస్‌ఫుల్‌ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తర్వాత 'లూసిఫర్‌' రీమేక్‌, 'వేదాళమ్' రీమేక్‌ చేయనున్నట్లుగా స్వయంగా మెగాస్టారే తెలిపారు. అయితే 'వేదాళమ్‌' రీమేక్‌కు సంబంధించి ఈ మధ్య బాగా వార్తలు వినిపిస్తున్నాయి. అదేమంటే.. ఇప్పటికే మెహర్‌ రమేష్‌ ఆధ్వర్యంలో స్ర్కిప్ట్ పనులు పూర్తయ్యాయని, చిరు ఎప్పుడంటే అప్పుడు సెట్‌పైకి వెళ్లేందుకు మెహర్‌ రెడీగా ఉన్నాడనే వార్తలతో పాటు డ్యాన్సింగ్‌ బ్యూటీ సాయిపల్లవి ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలి పాత్ర చేయబోతున్నట్లుగా వార్తలు వినిపించాయి.

 

అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రకు సాయిపల్లవిని కాకుండా 'మహానటి'తో అందరి మనసులు గెలుచుకున్న కీర్తిసురేష్‌ని నటింపజేయాలని చిత్రయూనిట్‌ భావిస్తోందట. 'వేదాళమ్‌' చిత్రం మొత్తం సిస్టర్‌ కోసమే నడుస్తుంది. హీరోయిజంతో పాటు చెల్లెలి పాత్రకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే ఈ పాత్ర విషయంలో చిత్రయూనిట్‌ ప్రత్యేక శ్రద్ద పెట్టినట్లుగా తెలుస్తుంది. ఈ పాత్రకి సాయిపల్లవి లేదా కీర్తిసురేష్‌ ఎవరైనా నిండుదనం వస్తుంది. మరి చివరికి ఈ పాత్ర ఎవరిని వరిస్తుందో తెలియదు కానీ.. ప్రస్తుతానికైతే చిత్రయూనిట్‌ మైండ్‌లో కీర్తిసురేషే ఉన్నట్లుగా టాక్‌ నడుస్తోంది.

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.