ltrScrptTheme3

Keerthi suresh: నవంబర్‌లో రిలీజ్ కాబోతున్న ‘గుడ్ లక్ సఖి’..

Oct 17 2021 @ 13:17PM

‘మహానటి’ సినిమాతో జాతీయ అవార్డునందుకున్న కీర్తి సురేష్ నటించిన 'గుడ్ లక్ సఖి' చిత్రాన్ని ఎట్టకేలకి రిలీజ్ చేయబోతున్నట్టు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఒక వైపు కమర్షియల్ సినిమాలలో హీరోయిన్‌గా నటిస్తూనే మరో కథా ప్రాధాన్యంతో పర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న లేడీ ఓరియంటెండ్ సినిమాల్లోనూ నటిస్తోంది కీర్తి. ఇప్పటికే 'పెంగ్విన్', 'మిస్ ఇండియా' చిత్రాలతో వచ్చిన ఆమె ఈ నవంబర్‌లో 'గుడ్ లక్ సఖి' మూవీతో రాబోతోంది. జాతీయ అవార్డు గ్రహీత నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో జగపతిబాబు, ఆదిపినిశెట్టి, రమాప్రభ, రాహుల్ రామకృష్ణ తదితరులు నటించారు. ఈ సినిమాకి రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతమందిచాడు. దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై సుధీర్ చంద్ర పడిరి నిర్మించారు. వాస్తవంగా ఈ సినిమా మార్చ్‌లోనే రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా మేకర్స్ పోస్ట్‌పోన్ చేశారు. నేడు (అక్టోబర్ 17) హీరోయిన్ కీర్తి సురేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా 'గుడ్ లక్ సఖి' చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ మేరకు అమెకు బర్త్ డే విషెస్ తెలుపుతూ కీర్తి కొత్త పోస్టర్‌ను వదిలారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.