Advertisement

ఆదిపురుష్: ప్రభాస్ సరసన `మహానటి`?

Mar 4 2021 @ 09:38AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. `రాధేశ్యామ్`ను విడుదలకు సిద్ధం చేస్తున్న ప్రభాస్ ప్రస్తుతం `సలార్` షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. త్వరలోనే `ఆదిపురుష్`ను ప్రారంభించనున్నాడు. `రామాయణం` ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాను రూపొందించనున్నారు. ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్, రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ కనిపించనున్నారు. 

 

ఇక, ఈ సినిమాలో సీత పాత్ర పోషించేది ఎవరనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఆ మధ్య కృతి సనోన్, అనుష్కా శెట్టి పేర్లు వినిపించాయి. తాజాగా కీర్తి సురేష్ పేరు తెర మీదకు వచ్చింది. `మహానటి`తో జాతీయ అవార్డు సాధించి బాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తున్న కీర్తిని సీత పాత్రకు ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్టు సమాచారం. కీర్తి ప్రస్తుతం పలు తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉంది. 

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.