Advertisement

నితిన్.. రెడీగా ఉండు: కీర్తి

Dec 3 2020 @ 09:56AM

`మహానటి` కీర్తి సురేష్ ప్రస్తుతం యంగ్ హీరో నితిన్‌తో కలిసి `రంగ్ దే` షూటింగ్‌లో పాల్గొంటోంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతోంది. షూటింగ్‌తో తమకు చెమటలు పడుతుంటే కీర్తి మాత్రం హ్యాపీగా రిలాక్స్‌ అవుతోందంటూ సినిమా సెట్లో కీర్తి నిద్రపోతున్న ఫొటోను హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ అట్లూరి సోషల్ మీడియాలో షేర్ చేశారు. 


ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కీర్తి స్పందించింది. ఆ ఇద్దరిపై పగ తీర్చుకుంటానని శపథం చేసింది. అన్నట్టుగానే డైరెక్టర్ వెంకీ అట్లూరిని సినిమా సెట్లో పరుగులు పెట్టించింది. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. `ఒకరి పని అయింది.. ఇంకొకరు ఉన్నారు. నితిన్.. త్వరలోనే నీపై పగ తీర్చుకుంటాన`ని కామెంట్ చేసింది. ఈ కామెంట్‌కు స్పందించిన నితిన్.. `ఐయామ్ వెయిటింగ్` అని రిప్లై ఇచ్చాడు. 

 


Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.