మోదీ సీరియస్.. కేజ్రీవాల్ సారీ

ABN , First Publish Date - 2021-04-23T22:56:59+05:30 IST

కోవిడ్ సమీక్షా సమావేశాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ వేదికగా చేసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు శుక్రవారంనాడు ఆరోపించాయి. ఆయన ప్రసంగం పరిష్కారం సూచించే దిశగా లేదని, బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం

మోదీ సీరియస్.. కేజ్రీవాల్ సారీ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన కోవిడ్ సమీక్షా సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యవహరించిన తీరు వివాదస్పదమైంది. ముఖ్యమంత్రులతో మోదీ సమావేశమైన ఈ కార్యక్రమాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ టెలికాస్ట్ చేయడం పట్ల ప్రధాని అసహనం వ్యక్తం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ మాట్లాడుతుండగా ప్రధాని కల్పించుకుని ‘ఏం జరుగుతోంది. ఇది మన సంప్రదాయానికి పూర్తిగా విరుద్ధం’ అంటూ లైవ్ టెలికాస్ట్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే అరవింద్ కేజ్రీవాల్ తేరుకుని క్షమాపణలు చెప్పారు. అయితే ఈ సమావేశం గురించి కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని, ఇకపై నుంచి జాగ్రత్తగా ఉంటామంటూ కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు.


అయితే ఈ సమావేశంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు, వాటిని ఆమ్ ఆద్మీ పార్టీ టెలికాస్ట్ చేయడం వివాదం కావడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) వివరణ ఇచ్చింది. ప్రధానితో సమావేశం ప్రసారం చేయరాదని లిఖితపూర్వకంగా కానీ, మౌఖికం కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి తమకెలాంటి ఆదేశాలు లేనందున సీఎం ప్రసంగాన్ని లైవ్‌లో షేర్ చేశామని తెలిపింది. ప్రజాప్రాధాన్యత గల అంశాల విషయంలో ఎలాంటి దాపరికాలు ఉండవని, అలాంటి ప్రజాప్రాధాన్యం కలిగిన విషయాలను గతంలోనూ లైఫ్ చేసిన సందర్భాలు ఉన్నాయని సీఎంఓ వివరణ ఇచ్చారు. లైవ్ ప్రసారం వల్ల ఎవరికైనా ఒకవేళ అసౌకర్యం కలిగినట్లయితే ఇందుకు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని కూడా సీఎంఓ ఆ ప్రకటనలో పేర్కొంది.


కోవిడ్ సమీక్షా సమావేశాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ వేదికగా చేసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు శుక్రవారంనాడు ఆరోపించాయి. ఆయన ప్రసంగం పరిష్కారం సూచించే దిశగా లేదని, బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారని ఆ వర్గాలు పేర్కొన్నారు. కేంద్రం ఒక్క వ్యాక్సిన్ డోస్‌ కూడా ఉంచుకోకుండా రాష్ట్రాలకు పంచుతోందన్న విషయం తెలిసి కూడా వ్యాక్సిన్ ధరలపై అబద్ధాలు చెప్పే ప్రయత్నం ఆయన చేసినట్టు ప్రభుత్వ వర్గాలు విమర్శించాయి. కేజ్రీవాల్ ఎయిర్ లిఫ్టింగ్ ఆక్సిజన్ ప్రస్తావన చేశారని, నిజానికి ఇప్పటికే  ఎయిర్‌లిఫ్ట్ ద్వారా ఆక్సిజన్‌ను కేంద్రం సరఫరా చేస్తోందని వారు తెలిపారు.

Updated Date - 2021-04-23T22:56:59+05:30 IST