ఆదాయం కోసం కేజ్రీవాల్ ఏమైనా చేస్తారు: స్మృతి ఇరాని

ABN , First Publish Date - 2022-02-04T21:46:16+05:30 IST

కేజ్రీవాల్ ఇబ్బడి ముబ్బడిగా మద్యం షాపుల్ని తెరుస్తున్నారు. అలాగే డ్రై డేస్‌ని కూడా తగ్గించారు. ఆదాయం కోసం కేజ్రీవాల్ ఎంతకైనా తెగిస్తారనే దానికి ఇదొక ఉదాహారణ. ఇక్కడ ఉన్న సోదరులందరిని నేను అడుగుతున్నాను.. ఒకసారి ఊహించండి..

ఆదాయం కోసం కేజ్రీవాల్ ఏమైనా చేస్తారు: స్మృతి ఇరాని

న్యూఢిల్లీ: ఆదాయం కోసం కేజ్రీవాల్ ఎంతకైనా దిగుజారుతారని, దానికి ప్రజల గౌరవాన్ని భద్రతను కూడా ప్రమాదంలోకి పడేస్తారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విమర్శించారు. ఢిల్లీలో డ్రై డేస్’ తగ్గించడం పట్ల ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ ప్రజావినాశకర పాలనకు ఇదొక ఉదహారణ అని ఆమె అన్నారు. ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులకు కేజ్రీవాలే బాధ్యత వహించాలని ఆమె అన్నారు.


‘‘కేజ్రీవాల్ ఇబ్బడి ముబ్బడిగా మద్యం షాపుల్ని తెరుస్తున్నారు. అలాగే డ్రై డేస్‌ని కూడా తగ్గించారు. ఆదాయం కోసం కేజ్రీవాల్ ఎంతకైనా తెగిస్తారనే దానికి ఇదొక ఉదాహారణ. ఇక్కడ ఉన్న సోదరులందరిని నేను అడుగుతున్నాను.. ఒకసారి ఊహించండి. మద్యం షాపు నుంచి మీ సోదరిణులు ఎన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొని ప్రయాణిస్తుంటారు. ఆ ప్రాంతంలో వాళ్లకు ఎదురయ్యే సవాళ్లు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించండి. వాళ్లు ఎదుర్కొనే ఇబ్బందులకు బాధ్యత కేజ్రీవాల్‌దే’’ అని స్మృతి ఇరాని అన్నారు.

Updated Date - 2022-02-04T21:46:16+05:30 IST