రామ్‌లల్లాను దర్శించనున్న కేజ్రీవాల్

ABN , First Publish Date - 2021-10-23T22:38:07+05:30 IST

ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈనెల 26న అయోధ్యలో 'రామ్‌లల్లా' ఆలయాన్ని..

రామ్‌లల్లాను దర్శించనున్న కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈనెల 26న అయోధ్యలో 'రామ్‌లల్లా' ఆలయాన్ని సందర్శించనున్నారు. దీపావళి పండుగ దగ్గర పడుతుండటంతో రామ్‌లల్లా దర్శనానికి కేజ్రీవాల్ వెళ్తున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం శనివారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది.


 కేజ్రీవాల్ గత మార్చిలో ఢిల్లీలోని సీనియర్ సిటిజన్లకు అయోధ్య ఉచిత యాత్రను ప్రకటించారు. ప్రజలకు రామరాజ్యం అందించాలనే లక్ష్యానికి అనుగుణంగా పది అంశాల స్ఫూర్తితో తాము పనిచేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. తాము గుర్తించిన పది అంశాల్లో ఆహారం, విద్య, మెడికల్ కేర్, విద్యుత్, నీరు, ఉద్యోగాలు, గృహాలు, మహిళా భద్రత, సీనియర్ సిటిజన్లను గౌరవించడం వంటివి ఉన్నట్టు కేజ్రీవాల్ పేర్కొన్నారు. 'ముఖ్యమంత్రి తీర్ధ యాత్ర యోజన' కింద ఢిల్లీకి చెందిన సీనియర్ సిటిజన్లకు ఉచిత యాత్రా సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. వారి పర్యటన, భోజన, వసతి సౌకర్యాలకు అయ్యే ఖర్చులు ప్రభుత్వమే భర్తిస్తుందని ఆయన తెలిపారు. రాముడు, హనుమంతుని భక్తునిగా తాను రామరాజ్య స్ఫూర్తితో ఢిల్లీ ప్రజలకు సేవలందించేందుకు కృతనిశ్చయంతో ఉన్నట్టు కూడా ఆయన ప్రకటించారు. కాగా, వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో కేజ్రీవాల్ అయోధ్య పర్యటన ప్రాధాన్యం సంతరించుకోనుంది.

Updated Date - 2021-10-23T22:38:07+05:30 IST