Kempegowda International Airport అరుదైన ఘనత

ABN , First Publish Date - 2022-06-30T22:17:29+05:30 IST

కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (Kempegowda International Airport) అరుదైన ఘనత సాధించింది.

Kempegowda International Airport అరుదైన ఘనత

బెంగళూరు: కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (Kempegowda International Airport) అరుదైన ఘనత సాధించింది. జూన్ చివరి వారం నాటికి 250 మిలియన్ల మంది ప్రయాణికుల మార్కును దాటేసింది. ప్రారంభమైన 15 సంవత్సరాల్లోనే ఈ మార్కును చేరుకోవడం విశేషం. అలాగే, అదే సమయంలో 2 మిలియన్ ఎయిర్‌క్రాఫ్ట్ మూమెంట్స్ (ATMs) జరిగాయి.


పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP)తో నిర్మించిన ఈ విమానాశ్రయం 2008లో ప్రారంభమైంది. కెనడాకు చెందిన ఎన్ఆర్ఐ ప్రేమ్ వత్సకు చెందిన ఫైర్‌ఫాక్స్ ఈ విమానాశ్రయాన్ని నిర్వహిస్తోంది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా ట్రాఫిక్ గ్రోత్ దారుణంగా పడిపోయింది. ఆ తర్వాత మాత్రం వేగంగా పుంజుకుంది. ఇప్పుడు 250 మిలియన్ల మంది ప్రయాణికుల మార్కును దాటేసి రికార్డులకెక్కింది.

Updated Date - 2022-06-30T22:17:29+05:30 IST