గోరటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

ABN , First Publish Date - 2021-12-30T21:50:10+05:30 IST

ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న అత్యన్నత పురష్కారం వరించింది. వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును ప్రకటించారు.

గోరటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

ఢిల్లీ: ప్రముఖ ప్రజాకవి, తెలంగాణ వాగ్గేయకారుడు, జానపద గాయకుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు అత్యున్నత పురస్కారం వరించింది. వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును ప్రకటించారు. ‘వల్లంకి తాళం’ కవితా గేయ రచనకు వెంకన్నకు అవార్డు ఇచ్చారు. 2021 సంవత్సరానికి గానూ కవిత్వ విభాగంలో వెంకన్నకు కేంద్ర సాహిత్య అవార్టు లభించింది. ఈ అవార్డు కింద ఆయనకు ప్రశంసా పత్రంతో పాటు లక్ష రూపాయలు నగదు ఇస్తారు. కేంద్ర సాహిత్య అకాడమీ ప్రతి ఏటా 20 భారతీయ భాషల్లో ప్రాచుర్యం పొందిన సాహిత్యానికి అవార్డులు ప్రకటించడం ఆనావాయితీ వస్తోంది. 2016లో తెలంగాణ ప్రభుత్వం వెంకన్నకు కాళోజీ పురస్కారం అందించింది. 2006లో నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కళారత్న అవార్డును ప్రదానం చేసింది. అంతేకాకుండా తెలంగాణ పాటను విశ్వవ్యాప్తం చేసిన గోరటి వెంకన్నకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2019లో “కబీర్‌ సమ్మాన్‌’ పురస్కారం ప్రదానం చేసింది. 


వెంకన్న పాటలు తెలుగు రాష్ట్రాల్లో విశేష ప్రజాదరణ పొందాయి. ఆయన రాసిన పాట ‘పల్లె కన్నీరు పెడుతోందో.. కనిపించని కుట్రల’ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన రాసి.. పాటిన పాటలు ఉర్రూత ఊగించాయి. ‘గల్లి సిన్నదీ గరీబోల్ల కధ పెద్దది’ అనే పాట తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనం రేపింది. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇటీవల సీఎం కేసీఆర్, వెంకన్నను ఎమ్మెల్సీగా మండలికి పంపారు. గోరటి వెంకన్న నాగర్‌ కర్నూలు జిల్లా గౌరారంలో జన్మించారు.




వెంకన్నతో పాటు తూగుళ్ల గోపాల్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం ఇచ్చారు. దేవరాజు మహారాజుకు కేంద్ర సాహిత్య అకాడమీ బలసాహిత్య అవార్డు వరించింది.



Updated Date - 2021-12-30T21:50:10+05:30 IST