పొలాలను పరిశీలించిన కేరళ మంత్రి

ABN , First Publish Date - 2021-10-17T06:34:26+05:30 IST

అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న ప్రకృతి ఉత్ప త్తులను పండించేందుకు రైతు లు ఆసక్తి చూపాలని, తద్వారా వారికి ఆర్థిక ఆదాయం పెంపొందుతుందని కేరళ వ్యవసాయ మంత్రి ప్రసాద్‌ అన్నారు.

పొలాలను పరిశీలించిన కేరళ మంత్రి
తాడిచర్లలో ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలిస్తున్న కేరళ మంత్రి ప్రసాద్‌

కామవరపుకోట, అక్టోబరు 16 : అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న ప్రకృతి ఉత్ప త్తులను పండించేందుకు రైతు లు ఆసక్తి చూపాలని, తద్వారా వారికి ఆర్థిక ఆదాయం పెంపొందుతుందని కేరళ వ్యవసాయ మంత్రి ప్రసాద్‌ అన్నారు. ప్రకృతి వ్యవసాయం అధ్యయనానికి శనివారం  తాడిచర్ల గ్రామంలో ఆయన పర్యటించి  పండ్ల తోటలు, వరి పొలాలను పరిశీలించారు.  ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న రైతులను ఆయన అభినందించారు. తాడిచర్ల సర్పంచ్‌ పార్థసారథి బాబు  కేరళ మంత్రిని  సత్కరించారు.  తహసీల్దార్‌  సత్యనారాయణ, మండల వ్యవసాయ అధికారి డాక్టర్‌ సి.పవన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-17T06:34:26+05:30 IST