ఎక్కువమంది పిల్లల్ని కంటే డబ్బులిస్తాం: కేరళ చర్చి ప్రకటన

ABN , First Publish Date - 2021-07-28T13:37:45+05:30 IST

కేరళలోని ఒక చర్చి వివాదాస్పద ప్రకటన చేసింది.

ఎక్కువమంది పిల్లల్ని కంటే డబ్బులిస్తాం: కేరళ చర్చి ప్రకటన

తిరువనంతపురం: కేరళలోని ఒక చర్చి వివాదాస్పద ప్రకటన చేసింది. అధిక సంతానం ఉన్న క్రైస్తవ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని తెలియజేసింది. ఐదుగురు లేదా అంతకన్నా ఎక్కువమంది పిల్లలు కలిగిన కుటుంబాలకు ప్రతీ నెలా రూ. 1500 ఇస్తామని ప్రకటించింది. అయితే ఈ అవకాశం 2000 తరువాత వివాహం చేసుకున్నవారికే వర్తిస్తుందనే నిబంధన విధించింది. 


ఈ ప్రకటన క్రైస్తవ జనాభాను పెంచేందుకు దోహదం చేసేలా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే సదరు చర్చి నిర్వాహకులు మాత్రం... కరోనా మహమ్మారి సమయంలో ఆదుకునేందుకు ఈ పథకం అమలు చేస్తున్నామని చెబుతున్నారు. సిరో-మలబార్ క్యాథలిక్ చర్చి నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం... ఇయర్ ఆఫ్ ది ఫ్యామిలీ సెటబ్రేషన్ కింద బిషప్ జోసెఫ్ కలర్గంట్ సారధ్యంలో జరిగిన సమావేశంలో ఈ ప్రకటన చేశారు. ఫ్యామిలీ అపోస్టోలెట్ ఫాదర్ కుట్టియాన్‌కల్ మాట్లాడుతూ ఈ ఆర్థిక సహాయం ఆగస్టు నుంచి అందజేస్తామన్నారు.

Updated Date - 2021-07-28T13:37:45+05:30 IST