వైద్య పరీక్షల కోసం అమెరికాకు కేరళ సీఎం

ABN , First Publish Date - 2022-01-07T21:37:52+05:30 IST

వైద్య పరీక్షల కోసం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈనెల 15న..

వైద్య పరీక్షల కోసం అమెరికాకు కేరళ సీఎం

తిరువనంతపురం: వైద్య పరీక్షల కోసం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈనెల 15న అమెరికా బయలుదేరి వెళ్తున్నారు. మెన్నెసోట‌ రాష్ట్రం రోచెస్టర్ సిటీలోని మయో క్లినిక్‌లో ఆయన వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. 15 నుంచి 29 వరకూ ఆయన అక్కడే ఉంటారు. పినరయి విజయన్, ఆయన భార్య కమల, ఆయన వ్యక్తిగత సహాయకుడు వీఎం సునీష్‌‌ల పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. సీఎం వైద్య పరీక్షలకయ్యే ఖర్చులన్నీ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ప్రభుత్వ ఉత్తర్వు పేర్కొంది.


పినరయి విజయన్ 2018లో కూడా మయో క్లినిక్‌లో చికిత్స తీసుకున్నారు. ఆ సమయంలో ఈ-ఫైలింగ్ సిస్టం కారణంతో తన తరఫు బాధ్యతలను మంత్రివర్గ సహచరులెవరికీ ఆయన ఇవ్వలేదు. దీంతో ముఖ్యమంత్రి పరోక్షంలో క్యాబినెట్ సమావేశాలకు పరిశ్రమల మంత్రి, సీపీఎం నేత పీపీ జయరాజన్ అధ్యక్షత వహించారు. మరోసారి సీఎం అమెరికా పర్యటనకు వెళ్తున్నందున తన మంత్రివర్గ సహచరులెవరికైనా చార్జ్ అప్పగిస్తారా, క్యాబినెట్ సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారనేది చూడాల్సి ఉంది. కాగా, గత వారంలోనే 20 రోజుల వైద్య చికిత్స కోసం రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి.అబ్దురహిమాన్ అమెరికా వెళ్లారు.

Updated Date - 2022-01-07T21:37:52+05:30 IST