కేరళ బీజేపీ చీ‌ఫ్‌పై ఎఫ్ఐఆర్ నమోదుకు కోర్టు ఓకే

ABN , First Publish Date - 2021-06-17T04:21:04+05:30 IST

కేరళ బీజేపీ చీ‌ఫ్‌పై ఎఫ్ఐఆర్ నమోదుకు కోర్టు ఓకే

కేరళ బీజేపీ చీ‌ఫ్‌పై ఎఫ్ఐఆర్ నమోదుకు కోర్టు ఓకే

తిరువనంతపురం: కేరళ బీజేపీ చీఫ్ కే సురేంద్రన్‌‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సుల్తాన్ బాతెరీ అనుమతించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రజలకు డబ్బులు ఇవ్వజూపారంటూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి. సురేంద్రన్ ఆడియో క్లిప్పుల ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ ముస్లిం స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఎంఎస్ఎఫ్) నేత పీకే నవాస్ కోర్టును ఆశ్రయించారు. జనాధిపతియ రాష్ట్రీయ పార్టీ (జేఆర్పీ) నేత సీకే జానూని ఎన్డీయే టికెట్‌పై సుల్తాన్ బాధెర్స్ నియోజక వర్గంలో పోటీ చేసేందుకు సురేంద్రన్ డబ్బులు ఎరజూపుతున్నట్టు సదరు ఆడియో క్లిప్పుల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనపై ఐపీసీ 171ఈ, 171ఎఫ్ కేసు నమోదు చేసేందుకు అనుమతి ఇస్తూ కోర్టు అనుమతి ఇచ్చింది. సీకే జానూ తనను కలవాలంటూ కేరళ బీజేపీ అధ్యక్షుడు సురేంద్రన్ కోరుతున్న ఓ ఆడియో క్లిప్పును జేఆర్పీ నేత ప్రసీతా అఝింకోడే నిన్న విడుదల చేశారు. సీకే జానూ ఎన్డీయేలో చేరి, ఎన్డీయే తరపున సల్తాన్ బాథెరీలో పోటీ చేసేందుకుగానూ సురేంద్రన్ రూ.10 లక్షలు ఇవ్వజూపారంటూ జేఆర్పీ ట్రెజరర్ ప్రసీతా అఝింకోడే ఆరోపించారు.

Updated Date - 2021-06-17T04:21:04+05:30 IST