
తిరువనంతపురం(కేరళ): కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిత్రం ముద్రించటాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కేరళ హైకోర్టు కొట్టివేసింది. కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాన్ని తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.కోర్టులో పిటిషన్ వేసిన పిటిషనరుకు లక్షరూపాయల జరిమానాను హైకోర్టు విధించింది. ఈ పిటిషన్ చిన్న పిల్లతనం, రాజకీయంగా ప్రేరేపితమని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్ పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఇవి కూడా చదవండి