Breaking News : రాజ్యాంగంపై విమర్శలు గుప్పించిన కేరళ మంత్రి సాజి చెరియన్ రాజీనామా

ABN , First Publish Date - 2022-07-06T23:39:24+05:30 IST

రాజ్యాంగాన్ని తీవ్రంగా విమర్శించిన కేరళ మంత్రి సాజి చెరియన్ తన మంత్రి

Breaking News : రాజ్యాంగంపై విమర్శలు గుప్పించిన కేరళ మంత్రి సాజి చెరియన్ రాజీనామా

తిరువనంతపురం : రాజ్యాంగాన్ని తీవ్రంగా విమర్శించిన కేరళ మంత్రి సాజి చెరియన్ తన మంత్రి పదవికి బుధవారం రాజీనామా చేశారు. రాజ్యాంగం గురించి తాను చేసిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని చెప్పారు. తాను రాజ్యాంగాన్ని కించపరచలేదన్నారు.


కేరళలోని పటనంతిట్టలో మంగళవారం జరిగిన సీపీఎం కార్యక్రమంలో సాజి చెరియన్ మాట్లాడుతూ, భారత దేశానికి గొప్ప లిఖితపూర్వక రాజ్యాంగం ఉందని మనమంతా చెప్తూ ఉంటామని, అయితే భారత దేశంలో అత్యధికులను కొల్లగొట్టడానికే ఈ రాజ్యాంగాన్ని రాశారని తాను అంటానని చెప్పారు. బ్రిటిషర్లు తయారు చేసిన దానిని ఓ భారతీయుడు రాజ్యాంగంగా రాశారని అన్నారు. అటువంటి రాజ్యాంగాన్ని మన దేశంలో 75 సంవత్సరాల నుంచి అమలు చేస్తున్నారన్నారు. 



Updated Date - 2022-07-06T23:39:24+05:30 IST