
కొట్టాయం(కేరళ): ప్రముఖ స్నేక్ క్యాచర్ వావా సురేష్ నాగుపాము కాటుకు గురయ్యారు. ఇళ్లలోకి వచ్చిన పాములను పట్టుకొని అడవుల్లో వదిలిన కేరళకు చెందిన సురేష్ నాగుపామును పట్టుకునేందుకు యత్నిస్తుండగా అతని కుడి కాలుపై కాటేసింది.తీవ్ర అస్వస్థతకు గురైన సురేష్ ను ఆసుపత్రికి తరలించారు. సురేష్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.సురేష్ గతంలో పలుసార్లు పాము కాటు నుంచి బయటపడ్డారు.స్నేక్ క్యాచర్ సురేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని వెంటిలేటర్ సపోర్ట్ కోసం కొట్టాయం మెడికల్ కాలేజీకి తరలించారు.
ఇవి కూడా చదవండి