లైంగిక వేధింపులు.. టాటూ ఆర్టిస్ట్ అరెస్ట్

ABN , First Publish Date - 2022-03-06T21:33:05+05:30 IST

లైంగిక వేధింపులతోపాటు, అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో టాటూ ఆర్టిస్ట్‌ను అరెస్ట్ చేశారు కేరళ పోలీసులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళకు చెందిన సుజీష్ అనే వ్యక్తి కోచిలోని ఎడ్డపల్లి ఏరియాలో పదేళ్లుగా టాటూ స్టూడియో నడుపుతున్నాడు.

లైంగిక వేధింపులు.. టాటూ ఆర్టిస్ట్ అరెస్ట్

లైంగిక వేధింపులతోపాటు, అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో టాటూ ఆర్టిస్ట్‌ను అరెస్ట్ చేశారు కేరళ పోలీసులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళకు చెందిన సుజీష్ అనే వ్యక్తి కోచిలోని ఎడ్డపల్లి ఏరియాలో పదేళ్లుగా టాటూ స్టూడియో నడుపుతున్నాడు. ఈ క్రమంలో గత శుక్రవారం పద్దెనిమిదేళ్ల యువతి ప్రైవేట్ పార్ట్స్‌పై టాటూ వేయించుకుంటుండగా, అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో తనపై టాటూ ఆర్టిస్ట్ లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సుజీష్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, మరో ఐదుగురు మహిళలు కూడా అతడిపై ఫిర్యాదు చేసేందుకు వచ్చారు.


సుజీష్ టాటూ వేసే క్రమంలో తమపై కూడా లైంగిక వేధింపులు, అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని వాళ్లు ఫిర్యాదు చేశారు. దీంతో బాధితుల ఫిర్యాదుపై స్పందించిన కోచి పోలీస్ కమిషనర్ నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే, సుజీష్ లాయర్‌ను కలిసేందుకు వెళ్తుండగా, పోలీసులు చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేశారు. బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని, నిందితుడిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని సీపీ చెప్పారు. మరోవైపు ఈ ఆరోపణలపై సుజీష్ కుటుంబం స్పందించింది. అమ్మాయిలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, టాటూ వేసే ప్రదేశం ఓపెన్‌గానే ఉంటుందని, లైంగిక వేధింపులకు అవకాశం లేదని కుటుంబ సభ్యులు అంటున్నారు.

Updated Date - 2022-03-06T21:33:05+05:30 IST