Kerala : కొచ్చి ఆటో డ్రైవరుకు రూ.12కోట్ల లాటరీ

Sep 21 2021 @ 12:20PM

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలోని కొచ్చి నగరానికి చెందిన ఒక ఆటో డ్రైవరుకు రూ.12 కోట్ల విలువైన ఓనం బంపర్ కేరళ లాటరీని గెలుచుకున్నాడు. ఈ ఏడాది కేరళ ఓనమ్ బంపర్ లాటరీ విజేతగా కొచ్చిలోని మరడు నివాసి జయపాలన్ నిలిచారు. జయపాలన్ మరాడు పట్టణంలోని అంబేద్కర్ జంక్షన్ ఆటోస్టాండులో ఆటోడ్రైవరు. కన్నన్ అని పిలిచే జయపాలన్ కు 95 ఏళ్ల తల్లి లక్ష్మీబాయి, భార్య మణి, వైశాఖ్, విష్ణులనే కుమారులున్నారు. ఆటోడ్రైవరు భార్య మణి చోట్టనిక్కర హోమియో ఆసుపత్రిలో స్వీపర్‌గా పనిచేస్తోంది. పెద్ద కుమారుడు వైశాఖ్ ఎలక్ట్రీషియన్ గా, మరో కుమారుడు విష్ణు హోమియో డాక్టరుగా పనిచేస్తున్నారు.

ఈ నెల 10వతేదీన విగ్రహం జంక్షన్ వద్ద మీనాక్షిలాటరీ నుంచి టికెట్ కొనుగోలు చేశానని జయపాలన్ చెప్పారు. రూ.12కోట్ల లాటరీ గెలిచిన జయపాలన్ కు పన్నులు, ఏజెంట్ కమీషన్ పోను రూ.7.39కోట్లు దక్కనున్నాయి.తన కుటుంబంతో చర్చించి, వచ్చిన లాటరీ డబ్బుతో నా ఆటో, గృహ రుణాలు చెల్లిస్తానని జయపాలన్ చెప్పారు. జయపాలన్ జాక్ పాట్ బహుమతి గెలుచుకున్న లాటరీ టికెట్టును బ్యాంకులో సమర్పించారు.ఈ ఏడాది 300రూపాయల విలువగల 54 లక్షల ఓనం బంపర్ లాటరీ టిక్కెట్లను రూ.126.5 కోట్లకు అమ్మారు.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.