మీసమున్న ఆమెకు... రోషమెక్కువ... మగరాయుడిలా మెలితిప్పుతూ...

ABN , First Publish Date - 2022-07-25T17:03:54+05:30 IST

మగవాళ్ళ మాదిరిగా ఆమె తన మీసాన్ని...

మీసమున్న ఆమెకు... రోషమెక్కువ... మగరాయుడిలా మెలితిప్పుతూ...

మగవాళ్ళ మాదిరిగా ఆమె తన మీసాన్ని మెలితిప్పి, దర్జాగా నడుస్తుంది. దీనికి ఆమె చెప్పే కారణం వింటే మీరు కూడా ఆమెకు సెల్యూట్ చేస్తారు. కొందరు యువతులకు ముఖం మీద, గడ్డం మీద వెంట్రుకలు పెరుగుతాయి. ఈ విధంగా కనిపించగానే వారు ఆ వెంట్రుకలను తొలగించడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. అయితే వీరికి భిన్నంగా ఒక మహిళ తన మూతి మీద పెరిగిన మీసాలను పెంచుతోంది. ఈ ఉదంతం కేరళలోని కన్నూర్ జిల్లాలో చోటుచేసుకుంది. 


35 ఏళ్ల షైజా తన మీసాల కారణంగా వార్తల్లో నిలిచింది.  ఈ వ్యవహారాన్ని ఆమె సన్నిహితులు కొందరు వ్యతిరేకించగా, మరికొందరు ఆమెకు మద్దతు పలికారు. దీని గురించి ఆమె  మాట్లాడుతూ తాను మీసాలను పెంచుకోవాలనుకుంటున్నానని, వాటిని తీసివేయాలనుకోవడం లేదని స్ఫష్టం చేసింది. ఈ మీసం తనకు గర్వకారణమని తెలిపింది. ప్రపంచం తన గురించి ఏమనుకున్నా పట్టించుకోనని తెగేసి చెబుతోంది. మీసాలు లేకుండా తాను ఉండలేనని చెప్పింది. కరోనా సమయంలోనూ తాను మీసాలను కప్పివుంచే మాస్క్ పెట్టుకోవడాన్ని ఇబ్బందిగా భావించానని పేర్కొంది. మీడియాకు తెలిసిన సమాచారం ప్రకారం షైజా గత పదేళ్లలో పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంది. తన మీసాల గురించి  ఎవరు ఏమన్నా పట్టించుకోలేదు. ఈ విషయంలో నిశ్చిత అభిప్రాయం ఏర్పరుచుకుంది. అయితే  షైజా ప్రపంచంలోనే మీసాలు ఉన్న మొదటి మహిళ కాదు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం 2016 లో బాడీ పాజిటివిటీ ప్రచారకర్త హర్నామ్ కౌర్ గుబురు గడ్డం కలిగిన అతి పిన్న వయస్కురాలు.

Updated Date - 2022-07-25T17:03:54+05:30 IST