కేసముద్రం మార్కెట్‌కు 2వేల బస్తాల మిర్చి రాక

ABN , First Publish Date - 2021-03-02T05:08:08+05:30 IST

కేసముద్రం మార్కెట్‌కు 2వేల బస్తాల మిర్చి రాక

కేసముద్రం మార్కెట్‌కు 2వేల బస్తాల మిర్చి రాక
కేసముద్రం మార్కెట్‌కు సోమవారం రైతులు విక్రయించేందుకు తీసుకువచ్చిన మిర్చి

కేసముద్రం, మార్చి 1 :  కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు మిర్చి రాబడులు పెరుగుతున్నాయి. మార్కెట్‌ ఆవిర్భవించిన నాటి నుంచి నూతనంగా గత నెల 13న మిర్చి కొనుగోళ్లను ప్రారంభించారు. తాజాగా సోమవారం 266 మంది రైతులు 2075 బస్తాల్లో 1038 క్వింటాళ్ల మిర్చిని తీసుకువచ్చారు. 25న 234 మంది రైతులు 1664 బస్తాల్లో 832 క్వింటాళ్ల మిర్చిని విక్రయించేందుకు తీసుకువచ్చారు. ప్రత్యక్ష బహిరంగ వేలంలో తేజ రకం క్వింటాకు గరిష్ఠంగా రూ.14,780, కనిష్ఠంగా రూ.11,500, సగటున రూ.14,150 ధరలు పలికాయి. సగటు ధర రూ.14వేల తగ్గకుండా కొనుగోళ్లు కొనసాగాయి. వరంగల్‌ మార్కెట్‌లో తేజ రకం గరిష్ఠ ధర రూ.13,600, మహబూబాబాద్‌లో గరిష్ఠంగా రూ.14,600, సగటున రూ.13,400 ధరలు ఉండడం గమనార్హం. బహిరంగ వేలం ద్వారా ఇతర మార్కె ట్ల కంటే క్వింటాపై రూ.200 నుంచి రూ.1100 వరకు అధికంగా ధర వస్తుండడంతో చుట్టు పక్కల మండలాలే కాకుండా పొరుగు జిల్లాల నుంచి రైతులు కూడా ఈ మార్కెట్‌లో విక్రయించేందుకే మొగ్గుచూపుతున్నారని చైర్మన్‌ మర్రి నారాయణరావు తెలిపారు. దేశీయ మార్కెట్లో సప్లై తక్కువగా ఉండి డిమాండ్‌ పెరుగుతుండడంతో ధరలు ఎగబాగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. రాబో యే కాలంలో మార్కెట్లోకి మిర్చి సప్లై పెరిగితే ధరలపై ప్రభావం చూపుతుందని వ్యాపారులు భావిస్తున్నారు.

 

Updated Date - 2021-03-02T05:08:08+05:30 IST