ప్రజలకు సుస్థిర పాలనను అందించాలి

Sep 21 2021 @ 00:45AM
సమావేశంలో మాట్లాడుతున్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు

కేశన శంకరరావు

 తాడేపల్లి, సెప్టెంబరు 20: ఏ రాష్ట్రమైనా, దేశమైనా సుస్థిర పాలన అందించాలంటే ఆయా రాజకీయ నాయకుల జీవితాలు, నైతిక విలువలు ప్రజలను ప్రభావితం చేసేలా ఉండాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకరరావు అన్నారు. సోమవారం తాడేపల్లి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేశన మాట్లాడుతూ ప్రజలు ఓట్ల వేసి అధికారం అందించింది అభివృద్ధి, సుస్థిరమైన పాలనను పాలకులు అందిస్తారని అన్నారు. అధికారం లేకపోయినా ప్రజల సమస్యలపై ప్రశ్నించే విధంగా ప్రతిపక్ష పాత్ర కూడా హుందాగా ఉండాలని సూచించారు. నేడు బలహీన వర్గాల ప్రాణాలకు రక్షణ కరువైందని కేశన వ్యాఖ్యానించారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు పోరాటాలు చేయాలిగానీ, ఆధిపత్య పోరుతో కాలాన్ని వృధా చేయరాదన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర యువజన అధ్యక్షుడు కుమ్మర క్రాంతికుమార్‌,  జిల్లా అధ్యక్షులు పరసా రంగనాఽథ్‌, మంగళగిరి పట్టణ అధ్యక్షుడు కోలా శ్రీనివాసరావు, నేతలు లక్ష్మయ్య, సుబ్బారావు, శివ, రామ్‌జీ తదితరులు పాల్గొన్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.